ములాయం తమ్ముడిని చూసి దు:ఖమొచ్చింది: యోగి ఆదిత్యనాథ్

ABN , First Publish Date - 2022-02-18T23:02:49+05:30 IST

ఈరోజు శివపాల్ యాదవ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆయనను చూసి నాకు దు:ఖమేసంది. ఆయన నేతాజీకి ఒకప్పుడు ప్రత్యేక సలహాదారుడు. కానీ నిన్న ఆయనకు కూర్చోవడానికి కూడా చోటు దొరకలేదు. ములాయం పక్కన ఆయన వేలాడుతూ నిలబడ్డారు..

ములాయం తమ్ముడిని చూసి దు:ఖమొచ్చింది: యోగి ఆదిత్యనాథ్

లఖ్‌నవూ: ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్‌ను చూస్తే దు:ఖమొచ్చిదంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఒక బస్సుల్లో అఖిలేష్ ఒకవైపు ములాయం సింగ్ యాదవ్ మరొకవైపు కూర్చున్నారు. శివపాల్‌కు కూర్చోవడానికి సీట్ లేకపోవడంతో అన్నయ్య ములాయం కూర్చున్న కుర్చీ పక్కన చేతులు పెట్టుకునే పట్టిపై కూర్చున్నారు. ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఖిలేష్ తీరు బాగోలేదంటూ ఓవైపు నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సంఘటటను ప్రస్తావిస్తూ యోగి స్పందించారు.


శుక్రవారం మైన్‌పురి జిల్లాలోని కర్హాల్‌లో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఈరోజు శివపాల్ యాదవ్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆయనను చూసి నాకు దు:ఖమేసంది. ఆయన నేతాజీకి ఒకప్పుడు ప్రత్యేక సలహాదారుడు. కానీ నిన్న ఆయనకు కూర్చోవడానికి కూడా చోటు దొరకలేదు. ములాయం పక్కన ఆయన వేలాడుతూ నిలబడ్డారు’’ అని యోగి అన్నారు. 

కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పైగా కర్హాల్ ఉన్న మైన్‌పురి లోక్‌సభ నుంచి ములాయం సింగ్ యాదవ్ ఎన్నికయ్యారు. ఇక యూపీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ 20వ తేదీన జరగనుంది. మొత్తం ఏడు విడతల పోలింగ్ అనంతరం మార్చి 10న ఫలితాలు వెలువడుతాయని ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-02-18T23:02:49+05:30 IST