Mumbai terror attack: తాజ్ హోటల్‌పై ఉగ్ర దాడిలో నా భార్య,పిల్లల్ని కోల్పోయాను...కన్నీరు తెప్పించిన హోటల్ జీఎం బాధాకరమైన జ్ఞాపకాలు

ABN , First Publish Date - 2022-09-10T17:15:01+05:30 IST

ముంబయి తాజ్ హోటల్‌లో(Mumbai Taj Hotel) ఉగ్రవాదులు జరిపిన నాటి దాడి ఘటనను ఆ హోటల్ జనరల్ మేనేజర్ కరంబీర్ కాంగ్(General Manager of the Taj Hotel)...

Mumbai terror attack: తాజ్ హోటల్‌పై ఉగ్ర దాడిలో నా భార్య,పిల్లల్ని కోల్పోయాను...కన్నీరు తెప్పించిన హోటల్ జీఎం బాధాకరమైన జ్ఞాపకాలు

న్యూయార్క్: ముంబయి తాజ్ హోటల్‌లో(Mumbai Taj Hotel) ఉగ్రవాదులు జరిపిన నాటి దాడి ఘటనను ఆ హోటల్ జనరల్ మేనేజర్ కరంబీర్ కాంగ్(General Manager of the Taj Hotel) న్యూయార్క్ నగరంలోని అంతర్జాతీయ వేదికపై గుర్తు చేసుకొని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ముంబయి నగరంలోని తాజ్ హోటల్‌పై 2008వ సంవత్సరం నవంబరు 26వతేదీన పాక్ ఉగ్రవాదులు దాడి ఘటన( 26/11 Mumbai terror attacks) గురించి బాధాకరమైన జ్ఞాపకాలను కరంబీర్ యూఎన్ గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం( first UN Global Congress of Victims of Terrorism) సదస్సులో పంచుకున్నారు. తాజ్ హోటల్‌లో(Taj Mahal hotel in Mumbai) నాడు జరిగిన ఉగ్రవాదుల దాడిలో తన భార్య, ఇద్దరు పిల్లలు మరణించారని కరంబీర్(Karambir Kang) ఆవేదనగా చెప్పారు. 


నా కుటుంబాన్ని కోల్పోయా...

నాటి ఉగ్ర దాడిలో తన కుటుంబసభ్యులందరినీ కోల్పోయానని కరంబీర్ పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగిన ముట్టడిలో ఉగ్రవాదులు తాజ్ హోటల్ వద్ద పలువురిని చంపారని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని,ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.ప్రపంచవ్యాప్తంగా బాధితులకు నివాళులు అర్పించే మొదటి యూఎన్ గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజంలో కరంబీర్ మాట్లాడారు.‘‘నేను భారతదేశంలోని ముంబయి నగరంలో ఉన్న తాజ్ హోటల్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో 10 మంది పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. మూడు రోజుల దాడిలో 34 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు’’ అని కాంగ్ చెప్పారు.


 న్యాయం కోసం 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం 

హోటల్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు తమ విధులను అడ్డుకున్నారని కాంగ్ చెప్పారు.‘‘మా హోటల్ సిబ్బంది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ, న్యాయం కోసం మేం 14 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేయాల్సి వచ్చింది. మేం బాధాకరమైన జీవితం గడిపాం’’అని ఆయన చెప్పారు. ‘‘న్యాయం కోసం కలిసి పనిచేయాలని నేను ఈ రోజు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తున్నాను.సభ్య దేశాలు మాతో చేరాలి’’ అని కాంగ్ ముగించారు.26/11 ముంబై ఉగ్రదాడిలో బాధితులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద బాధితులకు నివాళులు అర్పించేందుకు మొదటి ఐక్యరాజ్యసమితి(UN) గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం సెప్టెంబర్ 8-9 తేదీల మధ్య నిర్వహించారు.


ఉగ్రవాద బాధితులకు భారత్ నివాళి

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం సమావేశం జరిగింది.ఈ కాంగ్రెస్ తీవ్రవాద బాధితుల ప్రత్యక్షంగా అనుభవాలు, సవాళ్లు, వారి కథలు వెలుగుచూశాయి. ఈ సదస్సు 26/11 ముంబై ఉగ్రదాడుల బాధితులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద బాధితులకు నివాళిగా ఉంటుందని భారతదేశం ట్వీట్ చేసింది.






ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి వీడియో ట్వీట్ 

నాటి ముంబయి ఉగ్ర దాడి గురించి తాజ్ హోటల్ జీఎం కరంబీర్ కాంగ్ మొట్టమొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజంసదస్సులో చేసిన ప్రసంగ వీడియోను ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి రుచిరా కంబోజ్(Ruchira Kamboj) శనివారం ఉదయం ట్వీట్(tweet) చేశారు.రుచిరా కంబోజ్ చేసిన ట్వీట్ కు 518 మంది నెటిజన్లు రీ ట్వీట్ చేయగా,మరో 1758 మంది నెటిజన్లు లైక్ చేశారు. ‘‘ఉగ్ర దాడి సమయంలో నా భార్య, ఇద్దరు చిన్న కుమారులు తప్పించుకోలేక చనిపోయారు, నేను సర్వస్వం కోల్పోయాను. నా హోటల్ సిబ్బంది ధైర్యంతో ఆయుధాలు లేకుండానే పోరాడారు.ఈ దాడిలో మేం చాలా మంది సహచరులను కోల్పోయాం తాజ్ సిబ్బంది చేసిన వీరోచిత చర్య ఆ రాత్రి వేల మంది ప్రాణాలను కాపాడింది’’అన్నారాయన.

Updated Date - 2022-09-10T17:15:01+05:30 IST