నా ఫోన్‌ పనిచేయట్లేదు : హైదరాబాద్‌ సీపీ ట్వీట్‌

ABN , First Publish Date - 2021-05-10T16:38:39+05:30 IST

తాను అందుబాటులో లేకుండా పోయానని

నా ఫోన్‌ పనిచేయట్లేదు : హైదరాబాద్‌ సీపీ ట్వీట్‌

  • బీఎస్ఎన్‌ఎల్‌ సేవలకు అంతరాయం


హైదరాబాద్‌ సిటీ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం బీఎస్ఎన్‌ఎల్‌ సేవలకు అంతరాయం కలిగింది. అంబర్‌పేట్‌ ప్రాంతంలో కూడా సేవలు సరిగా లేకపోవడంతో తాను అందుబాటులో లేకుండా పోయానని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ట్వీట్‌ చేశారు. అంబర్‌పేట్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో అంతరాయం కలిగిందని ఆయన పేర్కొన్నారు. సాయంత్రానికల్లా బీఎస్ఎన్‌ఎల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 


Updated Date - 2021-05-10T16:38:39+05:30 IST