ltrScrptTheme3

ఐఏఎస్‌, రాజకీయం కలిస్తేనే అభివృద్ధి

Feb 7 2020 @ 19:18PM

ఏ పోస్టు ఆయినా నాకు ఒక్కటే

ఎందుకలా దిగజారి పోతారా అనిపిస్తుంది

పార్టీల్లో స్వీయ క్రమశిక్షణ అవసరం

11-10-10న జరిగిన ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో ఐవీ సుబ్బారావు


మొదట టీచింగ్‌ వృత్తిలో ఉన్నారు కదా?

నాకు మొదటి నుంచీ ఉపాధ్యాయ వృత్తి ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేశాను. అప్పుడే జవహర్‌లాల్‌ నెహ్రూ వర్సిటీలో ఇంటర్వ్యూ వచ్చింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇంగ్లిష్‌ పోస్టు. మణిపూర్‌లో ఉద్యోగం వచ్చింది. మంచి అనుభవం. ఇంకో ప్రదేశం చూద్దామనే ఉద్దేశంతో వెళ్లాను. ఢిల్లీ వర్సిటీలో ఉన్నప్పుడు స్నేహితులు సివిల్స్‌కు సన్నద్ధమవుతుండేవారు. నువ్వేంటి ఇంకా లెక్చరర్‌ పోస్టు అని తక్కువగా చూసేవారు. 1978లో రాశాను. ఎంపికయ్యాను. ఏ వృత్తిలోనైనా నిబద్ధత చాలా అవసరం.


ఈసీ సీఈవోగానే బాగా గుర్తింపు పొందారు?

నేను పదవి చేపట్టాక ఎన్నికలు వరుసగా వచ్చాయి. అర్థవంతంగా ఎన్నికలు నిర్వహించగలిగితే బాగుంటుందని భావించాను. ఆ దిశగా ప్రయత్నించాను. నేతలు ఎన్నికల నియమావళి అతిక్రమించినప్పుడు వెంటనే చర్యలు తీసుకున్నాం. పార్టీల్లో కూడా స్వీయ క్రమశిక్షణ అవసరం.


ఐఏఎస్‌ల ప్రమాణాలు ఇప్పుడెలా ఉన్నాయి?

ప్రమాణాలు పడిపోతున్నాయన్నది కొంత నిజమే. ఐఏఎస్‌, రాజకీయం కలిస్తేనే పనులు ముందుకు వెళతాయి. ఇందులో మంచి, చెడులు రెండూ ఉంటాయి. నా వరకూ రాజకీయ జోక్యం ఎక్కువ లేదు. నేను అదృష్టవంతుడిని. ఎవరితోనూ సమస్య ఎదురు కాలేదు.


పోస్టుల కోసం ఎందుకు దిగజారిపోతుంటారు?

అలా ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందించాలి. నాకు ఫలానా పోస్టు పెద్దది, ఫలానా పోస్టు చిన్నది అనిపించలేదు. ఏ ఐఏఎస్‌ అధికారీ అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేదు వాస్తవాలు.


మీరు చింతా మోహన్‌ దగ్గర పీఎస్‌గా పని చేయడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోయారు?

ఆయన కేంద్ర మంత్రిగా ఉండగా నన్ను అడిగారు. సలహాల కోసం రమ్మని అడిగితే... వెళ్లాను. (ఆర్కే: ఆయనపై ఆరోపణలు చాలా ఉన్నాయి.) నేను మారలేదు.


మీలాంటి ఐఏఎస్‌లు సమష్టిగా మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా?

చేయొచ్చు.. బహుశా నాకు ఢిల్లీలో అప్పగించబోతున్న పని అదేనేమో? ఎస్టాబ్లిష్‌మెంట్‌ అధికారిగా బాధ్యతలు ఇస్తున్నారు. (ఆర్కే: మొత్తం ఐఏఎస్‌, అధికారుల జాతకాలు మీ దగ్గర ఉంటాయి). మన రాష్ట్రంలో 20ు మంది ఐఏఎస్‌లు రోల్‌ మోడల్స్‌గా ఉన్నారు.


మీరు చూసిన సీఎంలలో ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు?

మార్కులు ఏం వేస్తాం గానీ, ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కో అంశం నేర్చుకున్నాను. ఎవరి నుంచైనా మంచిని గ్రహించడం మంచిది.


మీరు ఎక్కువగా విదేశీ పర్యటనలకు వెళ్తుంటారని, డిపెప్‌లో ఉండగా ఎక్కువ కంప్యూటర్లు కొనుగోలు చేయించారని ఆరోపణలున్నాయి?

అమెరికాలో నేను పీహెచ్‌డీ చేశాను. అక్కడ యూనివర్సిటీ వారు నన్ను గవర్నింగ్‌ బాడీలో మెంబర్‌గా వేశారు. నిపుణుడిగా నన్ను పిలుస్తుంటారు. మనవాళ్లకు అర్థం కాదు. ఏదో ప్రభుత్వ ఖర్చు మీద వెళ్తున్నారు అనుకుంటారు. వ్యక్తిగతంగానే పిలుస్తుంటారు. ఇక కంప్యూటర్లు కొనడం వృథా అనేవారున్నారు. అయితే, దానిపైన ఏర్పాటైన హౌస్‌ కమిటీ అన్నీ పరిశీలించి, దానిని మరింత విస్తరిస్తే బాగుంటుందని సూచించింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.