పెద్ద లీడర్ కావాలనుకున్నాను: ఓవైసీపై కాల్పులు జరిపిన నిందితుడు

ABN , First Publish Date - 2022-02-07T01:38:09+05:30 IST

నేను పెద్ద రాజకీయ వేత్తను కావాలని అనుకున్నాను. నాకు నేను పెద్ద దేశభక్తుడిగా భావిస్తాను. అయితే ఓవైసీ ప్రసంగాలు నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. అవి ప్రమాదకరంగా భావించాను..

పెద్ద లీడర్ కావాలనుకున్నాను: ఓవైసీపై కాల్పులు జరిపిన నిందితుడు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీకి వస్తున్న సమయంలో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల విచారణలో నిందితుడు ఒక సంచలన విషయాన్ని వెల్లడించాడు. తాను పెద్ద నాయకుడు కావాలనుకున్నానని.. తనకు బాగా దేశభక్తి ఉందని భావిస్తున్నానని, అయితే ఓవైసీ ప్రసంగాలు తనని రెచ్చగొట్టినట్టు అనిపించడంతో కాల్పులు జరిపినట్లు.. కాల్పులు జరిపే సమయంలో ఓవైసీ తనవైపు చూడడం వల్ల కిందకు కాల్చానని వెల్లడించాడు.


పోలీసుల విచారణలో ముందుగా ఏవేవో కారణాలు చెప్పినప్పటికీ.. సీసీటీవీ కెమెరా పుటేజీల ఆధారంగా పోలీసులు ఆదివారం దర్యాప్తు చేశారు. ‘‘నేను పెద్ద రాజకీయ వేత్తను కావాలని అనుకున్నాను. నాకు నేను పెద్ద దేశభక్తుడిగా భావిస్తాను. అయితే ఓవైసీ ప్రసంగాలు నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. అవి ప్రమాదకరంగా భావించాను. ఓవైసీ మాటలు నన్నురెచ్చగొట్టే విధంగా అనిపించాయి. ఆయనను చంపాలని అనుకున్నాను. అందుకే కాల్పులు జరిపాను. అయితే శుభం, నేను కాల్పులు జరుపుతున్న సమయంలో ఓవైసీ నన్ను చూశారు. ఆ కంగారులో నేరుగా కాల్చలేకపోయాను. గురి కిందకు వెళ్లింది’’ అని పోలీసుల విచారణలో సచిన్ శర్మ తెలిపాడు.

Updated Date - 2022-02-07T01:38:09+05:30 IST