ఉగ్ర కార్యకలాపాల్లో నా పాత్ర ఉంటే ఉరి తీయండి: Yasin Malik

ABN , First Publish Date - 2022-05-25T23:26:19+05:30 IST

యాసిన్‌ మాలిక్‌కు ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని కోర్టుకు NIA సూచించింది. కశ్మీర్‌లో ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో మాలిక్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడని, ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ ఏర్పాటు చేశాడని ఎన్‌ఐఏ తెలిపింది..

ఉగ్ర కార్యకలాపాల్లో నా పాత్ర ఉంటే ఉరి తీయండి: Yasin Malik

న్యూఢిల్లీ: ఈ నెల పదవ తేదీన తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించిన యాసిన్ మాలిక్.. తాజాగా మరో ప్రకటన చేశారు. తాను ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లైతే తనను ఉరి తీయండని కోర్టు ముందు తెలిపినట్లు అతడి లాయర్ తెలిపారు. ‘‘ఈ 28 ఏళ్లలో ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లైతే, దీనిని కనుక భారత ఇంటలీజెన్స్ విభాగం నిరూపించగలిగితే తన రాజకీయాల్ని వదిలేస్తానని యాసిన్ మాలిక్ కోర్టు ముందు తెలిపాడు. అంతే కాదు.. కోర్టును అతడు క్షమాభిక్ష కోరడం లేదు. అవసరమైతే ఉరిశిక్షకు కూడా సిద్ధమని ప్రకటించాడు. నిర్ణయాన్ని పూర్తిగా కోర్టుకు వదిలేశాడు’’ అని యాసిన్ మాలిక్ లాయర్ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో తాను ఏడుగురు ప్రధానమంత్రులతో కలిసి పని చేసిన విషయాన్ని యాసిన్ గుర్తు చేశాడట.


అయితే.. యాసిన్‌ మాలిక్‌కు ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని కోర్టుకు NIA సూచించింది. కశ్మీర్‌లో ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో మాలిక్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడని, ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ ఏర్పాటు చేశాడని ఎన్‌ఐఏ తెలిపింది. ఈ కేసులో యాసిన్ మాలిక్‌తో పాటు లష్కర్ ఎ తొయిబా వ్యవస్థాపకుడు హఫిజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సయ్యద్ సలాహుద్దీన్ పేర్లు కూడా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో ఉన్నాయి. మరోవైపు Yasin Malikపై కోర్టు తీర్పు నేపథ్యంలో పటియాలా కోర్టు పరిసరాలతో పాటు ఢిల్లీ, కశ్మీర్‌లో భారీగా భద్రతా ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-05-25T23:26:19+05:30 IST