ధైర్యంతోనే కొవిడ్‌ను జయించొచ్చు

May 24 2021 @ 23:54PM
గద్వాల ఆసుపత్రి ఆవరణలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి

- లాక్‌డౌన్‌తో తగ్గుతున్న కరోనా వ్యాప్తి 

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

- ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి గద్వాల ఆసుపత్రి పరిశీలన


గద్వాల, మే 24 (ఆంధ్రజ్యోతి) : కరోనా బారిన పడిన బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉంటే కొవిడ్‌ను జయించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె డ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వారణీదేవితో కలిసి సందర్శించారు. ఈ సం దర్భంగా ఐదు కొవిడ్‌ బ్లాక్‌లలో చికిత్స పొందుతున్న బాధి తులను పలుకరించారు. వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ వార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన అన్నం పొట్లాలను బాధితులకు, వారికి సహాయంగా వచ్చిన వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తో పాటు తనకూ కరోనా సోకిం దని, ఽధైర్యంగా ఉంటే ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలు కుంటామని చెప్పారు. రెండో దశ కరోనా వ్యాప్తి సందర్భంగా గద్వాల ఆస్పత్రిలో రోజూ 18-22 మంది చికిత్స కోసం చేరుతుండేవారని చెప్పారు. లాక్‌డౌన్‌తో కరోనా వ్యాప్తి కొంత అదుపులోకి వచ్చిందని, దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజూ పది నుంచి 12 మందికి చేరిందని వివరించారు. ఇంతటి విపత్కర పరిస్థితిలో బాధితులకు వై ద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర సహా యక సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ఆయన చెప్పారు. కా ర్యక్రమంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, జిల్లా అదనపు కలెక్టర్‌ రఘురాంశర్మ, వైద్యాధికారి చందునాయక్‌, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.


నిర్లక్ష్యం చేయొద్దు

కరోనా బాధితులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చే యొద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను కోరారు. జిల్లా ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆయన ఎమ్మెల్సీ సుర భి వాణీదేవితో కలిసి కలెక్టరేట్‌లో అధికారులతో కొవిడ్‌-19పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో సిబ్బంది కొర త ఉంటే వెంటనే భర్తీ చేసుకోవాలని చెప్పారు. బాధితులకు ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. అనంత రం ఫీవర్‌ సర్వేకు సంబంధించిన స మాచారాన్ని వైద్యాధికారులను అడి గి తెలుసుకున్నారు. జిల్లాలో 38 వేల గృహాల్లో సర్వేలు నిర్వి హంచగా, 6,666 మందికి జ్వ రం ఉన్నట్లు గుర్తించామని వై ద్యాధికారి చందూనాయక్‌ చె ప్పారు. వారికి మందుల కిట్లను అందజేశామని చెప్పారు. జిల్లా లో లాక్‌డౌన్‌ పరిస్థితిపై ఎస్పీ రం జన్‌ రతన్‌ కుమార్‌ను మంత్రి ప్ర శ్నించగా, లాక్‌డౌన్‌ను కఠినంగా అ మలు చేస్తన్నామని వివరించారు. కాగా, ఆస్పత్రి ఏరియాల్లో విద్యుత్‌ కో తలు లేకుండా చూడాలని, రైతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్‌ శాఖ అధికారులను మంత్రి ఆదేశించా రు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ తానూ కరో నా బారిన పడ్డానని, వైద్యుల సలహాలు, సూచనలతో కొవిడ్‌ బారి నుంచి బయట పడ్డానని చెప్పారు. ధైర్యంగా ఉండటమే శ్రీ రామరక్ష అని చెప్పారు. 

జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ వైద్య సి బ్బంది అందించే సేవలతో కరోనా నుంచి ప్రా ణాలను కాపాడుకోగలుగుతున్నామని అన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మా ట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు త గ్గుతున్నాయని చెప్పారు. అలంపూర్‌ ఎమ్మెల్యే అ బ్రహాం మాట్లాడుతూ అలంపూర్‌ అస్పత్రికి అం బులెన్స్‌ను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రఘురాంశర్మ తది తరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.