Advertisement

వడివేలుకి నేనిస్తా ఛాన్స్‌ అంటోన్న వివాదాస్పద నటి

Feb 26 2021 @ 18:07PM

కోలీవుడ్‌ హాస్య నటశిఖరం వడివేలు. గత దశాబ్దకాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నారు.  ఇందుకు కారణం.. గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే. అప్పటి నుంచి వడివేలు కోలీవుడ్‌ వెండితెరకు దూరమయ్యారు. అయినప్పటికీ వడివేలుకు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. పైగా షోషల్‌ మీడియాలో వడివేలు హాస్యనటనకు సంబంధించిన ఫోటోలే మీమ్స్‌ సృష్టికర్తల ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌గా ఉన్నాయి. అందుకే వడివేలు ఫోటోలు ఎల్లవేళలా సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న వడివేలు మాట్లాడుతూ, తాను నటనకు దూరమై పదేళ్ళు గడిచిపోయాయని, అయినా సినిమాల్లో నటించే ఉత్సుకత, హాస్యాన్ని పండించే శక్తియుక్తులు తనలో ఏమాత్రం తగ్గిపోలేదని, ఏ ఒక్కరూ అవకాశం ఇవ్వడం లేదంటూ వాపోయారు. ఈ మాటలు విన్న హీరో సూర్య... తన తదుపరి ప్రాజెక్టులో అవకాశం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, తిరుమురుగన్‌ చిత్రంలో కూడా వడివేలు నటించనున్నారు. 

 

ఇదిలావుంటే, వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన మీరా మిథున్‌ కూడా వడివేలు పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. వడివేలు వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయన్నారు. ‘త్వరలోనే నేను ఒక సినిమాను నిర్మించబోతున్నా. అందులో వడివేలుకు అవకాశం ఇస్తాను. ఆయన నటించాలని భావిస్తే తప్పకుండా ఆ చిత్రంలో నటించవచ్చు’ అని పేర్కొంది. జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నవారిని మోసంతోనూ, వంచనతోనూ తొక్కేస్తుంటారు. నిజానికి, ఒక వ్యక్తిని మరో వ్యక్తి అణిచివేయలేరు. వడివేలు లాంటివారు కన్నీరు కార్చకూడదు అంటూ మీరా మిథున్‌ ఓదార్పు వచనాలు పలికింది. మీరా మిథున్‌ కూడా గతంలో స్టార్‌ హీరోలపై కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.