రహస్యాలను leak చేస్తున్న IAF అధికారి Devendra Sharma అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-12T18:00:02+05:30 IST

facebook honey trap లో పడి సున్నతమైన సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు తమకు తెలిసిందని అన్నారు. అయితే ఈ సమాచారాన్ని ఐఎస్ఐ (Inter-Services Intelligence)కి చేరవేస్తున్నట్లు అనుమానాలున్నట్లు వారు వెల్లడించారు. దేవేంద్ర సింగ్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పని చేస్తున్నట్లు..

రహస్యాలను leak చేస్తున్న IAF అధికారి Devendra Sharma అరెస్ట్

న్యూఢిల్లీ: సున్నితమైన సమాచారాన్ని బయటకు రహస్యంగా చేరవేస్తున్న Indian Air Force అధికారి Devendra Sharma ను Delhi Police Crime Branch పోలీసులు గురువారం Arrest చేశారు. క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. facebook honey trap లో పడి సున్నతమైన సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు తమకు తెలిసిందని అన్నారు. అయితే ఈ సమాచారాన్ని ఐఎస్ఐ (Inter-Services Intelligence)కి చేరవేస్తున్నట్లు అనుమానాలున్నట్లు వారు వెల్లడించారు. దేవేంద్ర శర్మ.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పని చేస్తున్నట్లు, అక్కడి నుంచే ఆయన ఈ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ విషయమై ఆయనను ఈ నెల 6నే కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని బయటపడడంతో గురువారం అరెస్ట్ చేశారు.

Read more