Mig-21 Fighter planes: 2025 నాటికి పూర్తిగా వీడ్కోలు

ABN , First Publish Date - 2022-07-30T01:32:00+05:30 IST

ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాప్ మరో స్కా్డ్వ్రన్‌కు వీడ్కోలు పలకాలని..

Mig-21 Fighter planes: 2025 నాటికి పూర్తిగా వీడ్కోలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాప్ మరో స్కా్డ్వ్రన్‌కు వీడ్కోలు పలకాలని, 2025 కల్లా సైన్యంలోని ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (India Air forece) నిర్ణయించింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో గురువారం రాత్రి మిగ్‌ -21 టైప్ 69 ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురై ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆదిత్య బల్ (జమ్మూ ), వింగ్ కమాండర్ ఎం.రాణా (హిమాచల్ ప్రదేశ్) మృతిచెందిన నేపథ్యంలో ఐఏఎఫ్ తాజా నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద నాలుగు స్క్వాడ్రన్ల మిక్ విమానాలు ఉన్నాయి.


మిగ్ విమానాలను ఐఏఎఫ్ చాలాకాలం క్రితమే ఉద్వాసన పలకాల్సి ఉన్నప్పటికీ ఎల్‌సీపీ తేజాస్ (LCA Tejas) విమానాలను ప్రవేశపెట్టడంతో మిగ్ సర్వీసులను కొనసాగించడం అనివార్యమైంది. 1963లో మిగ్-12 యుద్ధ విమానం మొదటిసారి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌గా భారత వైమానిక దళంలోకి సోవియట్ యూనియన్ నుంచి వచ్చి చేరింది. దాదాపు 6 దశాబ్దాలుగా మిగ్ విమానాలు సేవలందిస్తున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా ఈ విమానాలు తరచూ కూలిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన ఈ విమానాల గత సేవలను స్మరించుకుంటూ వాయుసేన మరో మూడేళ్లలో పూర్తిగా వీడ్కోలు పలుకనుంది.

Updated Date - 2022-07-30T01:32:00+05:30 IST