
- 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం
బెంగళూరు: మైసూరు జిల్లా అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. విచారణాధికారిగా అదనపు కార్యదర్శి జైరాంను నియమించింది. నాలుగు విభాగాలపై ప్రాథమిక విచారణ జరిపి 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జేడీఎస్ ఎమ్మెల్యే సా రా మహేశ్, మైసూరు జిల్లా అధికారిగా రోహిణి సింధూరి వ్యవహరించిన వేళ ఆరోపణలు చేశారు. పర్యావరణ స్నేహి బట్టబ్యాగుల కొనుగోళ్లలో అక్రమాలు, జిల్లా అధికారి అధికారిక నివాసంలో రూ.50 లక్షలతో స్విమ్మింగ్ పూల్, జిమ్ నిర్మాణం ద్వారా చారిత్రాత్మక కట్టడానికి హాని చేశారని, కరోనా మృతుల సంఖ్య తక్కువ చూపారని, చామరాజనగరలో ఆక్సిజన్ లేక పలువురు మృతి చెందిన అంశాలపై రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్నాయి. వాటిని ప్రాథమికంగా విచారించాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి