సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్

ABN , First Publish Date - 2022-01-12T17:33:29+05:30 IST

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ట్విట్టర్ ఖాతా బుధవారం ఉదయం హ్యాక్ అయింది.

సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్

న్యూఢిల్లీ:సాక్షాత్తూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ట్విట్టర్ ఖాతా బుధవారం ఉదయం హ్యాక్ అయింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు జనవరి 12 వతేదీన హ్యాకింగ్ చేశారు.అయితే కొద్ది సమయంలోనే ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు.సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో హ్యాకర్లు పోస్టు చేసిన ట్వీట్లను తొలగించింది. హ్యాకర్లు ట్విట్టర్ ఖాతాలో కొన్ని హానికరమైన లింక్‌లను పోస్టు చేశారు. సరిగ్గా నెలరోజుల క్రితం డిసెంబరు 12వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా కొద్దిసేపు హ్యాక్ అయింది. 



కొద్దిసేపటి తర్వాత ప్రధాని ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించినా, దీని నుంచి క్రిప్టోకరెన్సీపై ట్వీట్ షేర్ చేశారు. జనవరి 3న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ , మన్ దేశీ మహిళా బ్యాంక్ (మైక్రోఫైనాన్స్ బ్యాంక్) ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి.ఈ ఖాతాను పునరుద్ధరించినట్లు సమాచార  ప్రసార మంత్రిత్వ శాఖ బుధవారం ట్వీట్ చేసింది. 

Updated Date - 2022-01-12T17:33:29+05:30 IST