ICC ODI Rankings: ఇకపై నంబర్ వన్ బౌలర్ బౌల్ట్ కాదు.. బూమ్.. బూమ్.. బుమ్రా..

ABN , First Publish Date - 2022-07-14T00:51:31+05:30 IST

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) టీమిండియా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా సత్తా చాటాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో..

ICC ODI Rankings: ఇకపై నంబర్ వన్ బౌలర్ బౌల్ట్ కాదు.. బూమ్.. బూమ్.. బుమ్రా..

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) టీమిండియా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) సత్తా చాటాడు. ఐసీసీ (ICC) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను (Trent Boult) వెనక్కి నెట్టి బుమ్రా అగ్ర స్థానంలో నిలిచాడు. 2020 ఫిబ్రవరికి ముందు రెండేళ్లు అగ్రస్థానంలో కొనసాగిన బుమ్రా ఆ తర్వాత రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో (England 1st ODI) ఆరు వికెట్లు పడగొట్టి రాణించిన బుమ్రా 718 పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) మళ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఇక.. వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ (ICC ODI Batting Rankings) విభాగంలో పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, ఇమామ్-ఉల్-హక్ ఒకటి, రెండు స్థానాల్లో నిలిచారు. మూడు, నాలుగు స్థానాల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. ODI Rankings ఆల్ రౌండర్ల విభాగంలో టాప్ 10లో భారత ఆటగాడు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.



ఇక.. టీ20 ర్యాంకింగ్స్ (T20 Rankings) విషయానికొస్తే టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) టాప్ 5లో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 732 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో (England) జరిగిన మూడో టీ20లో సెంచరీతో సూర్యకుమార్ యాదవ్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. టీ20 ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ 658 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో బుమ్రా మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 842 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో రిషబ్ పంత్ 801 పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. నంబర్ వన్ బౌలర్‌గా నిలిచిన బుమ్రాను బీసీసీఐ ట్విట్టర్ వేదికగా అభినందించింది.

Updated Date - 2022-07-14T00:51:31+05:30 IST