ICC T20I Rankings: సూర్యకుమార్ యాదవ్‌ నెం 2.. విరాట్ కోహ్లీ ర్యాంక్ ఎంతో తెలుసా..

ABN , First Publish Date - 2022-08-11T00:23:31+05:30 IST

టీమిండియా (Team India) క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తిరిగి నెంబర్ 2 స్థానాన్ని దక్కించుకున్నారు.

ICC T20I Rankings: సూర్యకుమార్ యాదవ్‌ నెం 2.. విరాట్ కోహ్లీ ర్యాంక్ ఎంతో తెలుసా..

దుబాయ్ : టీమిండియా (Team India) క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఐసీసీ(ICc) టీ20 ర్యాంకింగ్స్‌లో తిరిగి నెంబర్ 2 స్థానాన్ని దక్కించుకున్నాడు. 805 పాయింట్లతో  2 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతుండగా.. 818 పాయింట్లతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam) అగ్రస్థానంలోనే నిలిచాడు. ఈ మేరకు ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌(ICC T20 Rankings)ను బుధవారం ప్రకటించింది. ఇటివల 5 టీ20 మ్యాచ్‌ల వెస్టిండీస్‌ (West indies) పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ బాగానే పరుగులు చేసినా 11 రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. చివరి మ్యాచ్‌కి విశ్రాంతినివ్వడంతో  నెం 1 ర్యాంకును పొందే అవకాశం తప్పింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం చివరిగా ఏప్రిల్‌లో టీ20 మ్యాచ్ ఆడాడు. అయినప్పటికీ నంబర్ 1 ర్యాంకులోనే కొనసాగుతుండడం గమనార్హం. ఆసియా టీ20 కప్ (Asia T20 Cup) నేపథ్యంలో సూర్యకమార్ యాదవ్, బాబర్ ఆజం మధ్య ర్యాంకింగ్ విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. కాగా ఆగస్టు 28న ఇండియా ఆరంభ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌(Pakistan)తో తలపడనుంది.


మిగతా భారత ప్లేయర్ల విషయానికి వస్తే.. రోహిత్ శర్మ 16వ ర్యాంకు, విరాట్ కోహ్లీ 32వ స్థానాల్లో నిలిచారు. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తమ స్థానాలను స్వల్పంగా మెరుగుపరచుకున్నారు. అయ్యర్ ఆరు స్థానాలు ఎగబాకి 19వ ర్యాంకు, రిషబ్ పంత్ 7 స్థానాలు మెరుగుపడి 59వ స్థానంలో నిలిచారు. 

ఇక బౌలర్ల విషయానికి వస్తే.. భువనేశ్వర్ కుమార్ ఒక స్థానం దిగజారి 9వ ర్యాంకుకి పడిపోయాడు. వెస్టిండీస్ సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టిన రవి బిష్ణోయ్ 50 స్థానాలు మెరుగుపరచుకుని 44వ ర్యాంకుని పొందాడు. ఆవేవ్ ఖాన్, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు కూడా ర్యాంకులను మెరుగుపరచుకున్నారు.


T20 బ్యాటింగ్ ర్యాంక్స్ :

1. బాబర్ ఆజం (పాకిస్తాన్) - 818

2. సూర్యకుమార్ యాదవ్(ఇండియా) - 805

3. మొహమ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్) - 794

4. ఐడెన్ మార్‌క్రమ్(సౌతాఫ్రికా) - 792

5. డేవిడ్ మలన్ (ఇంగ్లండ్) - 731

6. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) - 716

7. పతుమ్ నిస్సాంకా (శ్రీలంక) - 661

8. డేవోన్ కాన్వే (న్యూజిలాండ్) - 655

9. నికోలస్ పూరన్ (వెస్టిండీస్) - 644

10. మార్టిన్ గుప్తిల్(న్యూజిలాండ్) - 638.

Updated Date - 2022-08-11T00:23:31+05:30 IST