మేడమ్‌..! మా సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-12-05T05:26:45+05:30 IST

‘మేడమ్‌..! అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. అర్హతలున్నా ఉద్యోగోన్నతులు ఇవ్వమంటే ఇ వ్వరు. దీంతో సీనియర్లు నష్టపోతున్నారు. మరోవైపు నెలలు తరబడి జీతాలతో పా టు ఇతర బిల్లులు ఇవ్వడం లేదు.

మేడమ్‌..! మా సమస్యలు పరిష్కరించండి

అంగనవాడీ యూనియన నేతలు వేడుకోలు 

సీఎ్‌ఫఎంఎ్‌సలో బిల్లులు పెట్టామన్న ఐసీడీఎస్‌ పీడీ  

అనంతపురం వైద్యం, డిసెంబరు 4: ‘మేడమ్‌..! అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. అర్హతలున్నా ఉద్యోగోన్నతులు ఇవ్వమంటే ఇ వ్వరు. దీంతో సీనియర్లు నష్టపోతున్నారు. మరోవైపు నెలలు తరబడి జీతాలతో పా టు ఇతర బిల్లులు ఇవ్వడం లేదు. మా సమస్యలు పరి ష్కరించండి’ అంటూ ఐసీడీఎస్‌  పీడీ సుజనను అంగన వాడీ కార్యకర్తల సంఘం నేతలు వేడుకున్నారు. శనివా రం మహిళా ప్రాంగణంలో జిల్లా స్థాయి అంగనవాడీ కా ర్యకర్తలు, సహాయకుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ స మావేశం నిర్వహించారు. అన్ని ప్రాజెక్టుల సీడీపీఓలు, యూనియన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన నాయకులు శ్రీదేవి, శకుంతల, సీఐటీయూ నాయకులు ఓబులు, జిల్లాలో అంగనవాడీ కార్యకర్తలు, ఆ యాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పీడీకి వివరించారు. మూడు నెలలుగా జీతాలు రాలేదు. కూరగాయలు, గ్యాస్‌ బిల్లుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ధరలు పెరిగాయి. అప్పులు తెచ్చి కేంద్రాలు నడుపుకుంటున్నా మని పీడీకి వివరించారు. ఇందుకు పీడీ స్పందిస్తూ మీ సమస్యల గురించి రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్తామని , ఇప్పటికే జీతాలు ఇతరత్ర బిల్లులు సీఎ్‌ఫఎంఎ్‌సలో అక్టో బరు వరకు సబ్మిట్‌ చేశామని, త్వరలో మీ ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆంశాల పరిష్కరానికి చర్యలు తీసుకుంటా మని హామీఇచ్చారు. సీడీపీఓలు కూడా బిల్లులు సకాలంలో పంపించేలా చూడాలని పీడీ ఆదేశించారు.


Updated Date - 2021-12-05T05:26:45+05:30 IST