ICICI Bank: క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు హెచ్చరిక

ABN , First Publish Date - 2022-09-20T17:30:34+05:30 IST

ఐసీఐసీఐ బ్యాంకు(ICICI Bank) క్రెడిట్ కార్డుదారులకు(Credit Card Holders) మంగళవారం ఆ బ్యాంకు హెచ్చరిక(ALERT) జారీ చేసింది....

ICICI Bank: క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు హెచ్చరిక

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు(ICICI Bank) క్రెడిట్ కార్డుదారులకు(Credit Card Holders) మంగళవారం ఆ బ్యాంకు కొత్త హెచ్చరిక(ALERT) జారీ చేసింది.అక్టోబరు 20వతేదీ నుంచి క్రెడిట్ కార్డు సేవలపై ఒక శాతం సర్వీసు చార్జీ(new charge) విధించాలని ఐసీఐసీఐ బ్యాంకు నిర్ణయించింది. దీంతో క్రెడిట్ కార్డుదారులపై అదనపు భారం పడనుంది.ఐసీఐసీఐ బ్యాంక్‌కి భారతదేశంలో 11 మిలియన్లకు పైగా క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు.బ్యాంకు అద్దె చెల్లింపులపై 1శాతం ఛార్జీని కొత్తగా ప్రవేశపెట్టింది.క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి అద్దె చెల్లింపును సులభతరం చేసే ప్లాట్‌ఫారమ్‌లు విధించే సేవా ఛార్జీకి ఇది అదనం.



‘‘ప్రియమైన ఖాతాదారులారా, అక్టోబర్20వతేదీ నుంచి అద్దె చెల్లింపు కోసం మీ ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లోని అన్ని లావాదేవీలపై ఒక శాతం రుసుము వసూలు చేస్తాం’’ అని బ్యాంకు తెలిపింది. దీంతో క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసే అద్దె చెల్లింపులపై చార్జీ విధించిన తొలి బ్యాంకుగా ఐసీఐసీఐ బ్యాంక్ అవతరించింది.



Updated Date - 2022-09-20T17:30:34+05:30 IST