ఎంఎఫ్‌ల తాకట్టుపై ఐసీఐసీఐ బ్యాంకు రుణం

ABN , First Publish Date - 2020-07-01T05:30:00+05:30 IST

మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను తాకట్టు పెట్టి రుణం పొందే సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఎంఎఫ్‌ల తాకట్టుపై ఐసీఐసీఐ బ్యాంకు రుణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):  మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను తాకట్టు పెట్టి రుణం పొందే సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈక్విటీ, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీములకు చెందిన యూనిట్లను తనఖా పెట్టి వెంటనే రూ.కోటి వరకూ రిటైల్‌ ఖాతాదారులు రుణం పొందవచ్చని బ్యాంకు తెలిపింది. బ్యాంకు శాఖకు రాకుండానే డిజిటల్‌ మార్గంలో రుణం తీసుకోవచ్చు. ఓవర్‌డ్రా్‌ఫ్టగా ఈ రుణం ఇస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు అధిపతి రాజేష్‌ అయ్యర్‌ తెలిపారు. డెట్‌ లేదా ఈక్విటీ స్కీముల యూనిట్లను తాకట్టు పెట్టుకుని కనీసం రూ.50 వేల రుణాన్ని ఇస్తారు. డెట్‌ స్కీముల యూనిట్లపై గరిష్ఠంగా రూ. కోటి, ఈక్విటీ స్కీముల యూనిట్లపై రూ.20 లక్షల వరకూ రుణం ఉంటుంది. రుణాన్ని ఓవర్‌డ్రా్‌ఫ్టగా పొందడం వల్ల ఖాతాదారు స్థిర ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. ముందుగా రుణాన్ని చెల్లిస్తే కూడా ఎటువంటి రుసుమూ వసూలు చేయరు. 

Updated Date - 2020-07-01T05:30:00+05:30 IST