
హైదరాబాద్ : దేశంలో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘ఐసీఐసీఐ(ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)’... ఖాతాదారులు, వినియోగదారులకు చుక్కలు చూపించింది. శుక్రవారం ఈ పరిస్థితి చోటుచేసుకుంది. పెద్దసంఖ్యలో వినియోగదారులు... నెట్ బ్యాంకింగ్ సేవలతోపాటు బ్యాంక్ మొబైల్ యాప్ వాడకం విషయంలో సాంకేతిక సమస్యలనెదుర్కొన్నారు. ఈ క్రమంలో... ట్విట్టర్ వేదికగా తీవ్ర అసంతృప్తులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వచ్చిన ఫిర్యాదులపై బ్యాంక్ స్పందించింది. ‘సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొంది. వీలైనంత త్వరలోనే సమస్యను పరిష్కరించి అప్డేట్ ఇస్తామని పేర్కొంది. కాగా... స్టాక్ మార్కెట్ నడిచే సమయంలో ఇలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఓ ఖాతాదారుడు వ్యాఖ్యానించారు. కాగా... గతంలో మరో ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్ డీఎఫ్ సీ’ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. ప్రధానంగా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతొ కొన్ని రోజుల పాటు... క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా హెచ్డీఎఫ్ సీ బ్యాంకును నిలువరిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి