ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పీఎస్‌యూ బాండ్‌ ఇండెక్స్‌ ఫండ్‌

Sep 19 2021 @ 02:13AM

 ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. బాండ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను విడుదల చేసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పీఎస్‌యూ బాండ్‌ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ 40: 60 ఇండెక్స్‌ ఫండ్‌ -సెప్టెంబరు 2027 పేరుతో దీన్ని తీసుకువచ్చింది. ఈ నెల 16న ప్రారంభమైన కొత్త ఫండ్‌ ఆఫర్‌ 27న ముగియనుంది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్‌. నిఫ్టీ పీఎ్‌సయూ బాండ్‌ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ బాండ్‌ సెప్టెంబరు 2027 40ః60 ఇండెక్స్‌లో ఈ ఫండ్‌ పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ సంస్థలు, స్టేట్‌ డెవల్‌పమెంట్‌ లోన్స్‌ (ఎస్‌డీఎల్‌) ద్వారా జారీ చేసిన ఏఏఏ రేటెడ్‌ బాండ్లలోని పోర్టుఫోలియోల్లో 40ః60 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.1,000. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. ఈ బాండ్లు 2027 సెప్టెంబరు 30న మెచ్యూర్‌ అవుతాయి. ప్రతి త్రైమాసికంలో ఈ ఇండెక్స్‌ను ఫండ్‌ సమీక్షించనుంది. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ కావాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐసీఐసీఐ ఎంఎఫ్‌ పేర్కొంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.