దళిత బంధు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-05-22T05:59:22+05:30 IST

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదర్శ వంతంగా దళిత బంధు పథకం ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

దళిత బంధు దేశానికే ఆదర్శం
లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదర్శ వంతంగా దళిత బంధు పథకం ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం పట్టణంలోని వివేకానంద మినీ స్టేడి యంలో జిల్లాలోని ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల దళిత బంధు పథకం లబ్ధిదారులకు మంజూ రు అయిన వాహనాలు, ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. జిల్లాలోని 107 మంది లబ్ధి దారులకు ఆస్తుల పంపిణీ చేయగా ఇందులో 44 ట్రాక్టర్లు, 26 ప్యాసింజర్‌ ట్రాన్స్‌ పోర్టు వాహనాలు, 12 రిటైల్‌ యూనిట్లు, 17 సర్వీసు రంగం యూ నిట్లు, 8 తయారీ రంగం యూనిట్లను పంపిణీ చేశారు. జగిత్యాల నియో జకవ ర్గంలో 58 మంది లబ్ధిదారులకు ఆస్థుల పంపిణీ జరపగా ఇందులో 16 ట్రాక్టర్లు, 13 ప్యాసింజర్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలు, 11 రిటైల్‌ యూనిట్లు, 12 సేవా రంగం యూనిట్లు, 6 తయారీ రంగం యూనిట్లను పంపిణీ చే శారు. అదేవిధంగా చొప్ప దండి నియోజకవర్గంలోని 12 లబ్ధిదారులకు ఆ స్తుల పంపిణీ జరపగా ఇందులో 8 ట్రాక్టర్లు, 2 ప్యాసింజర్‌ ట్రాన్స్‌ పోర్టు వాహనాలు, 1 రిటైల్‌ యూనిట్‌, 1 సర్విస్‌ రంగం యూనిట్‌లను అందిం చారు. కోరుట్ల నియోజకవర్గంలోని 11 లబ్ధిదారులకు ఆస్తుల పంపి ణీ జ రపగా ఇందులో 6 ట్రాక్టర్లు, 5 ప్యాసింజర్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలు అం దించారు. ధర్మపురి నియోజకవర్గంలోని 26 లబ్ధిదారులకు ఆస్తుల పంపి ణీ జరపగా ఇందులో 14 ట్రాక్టర్లు, 6 ప్యాసింజర్‌ ట్రాన్స్‌పోర్టు వాహ నాలు, 4 సర్విస్‌ రంగం యూనిట్‌లు, 2 తయారీ రంగం యూనిట్లను అం దించారు. ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన, ఆశయం మేరకు దళిత బంధు పథకం సమర్థవంతం గా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి వి శేష కృషి చేస్తోందన్నారు. దళితులను అన్ని రంగాల్లో రాణించే విధం గా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో 345 మంది లబ్ధిదారులను దళితబంధు పథకానికి ఎంపిక చేయగా ఇందులో వ్యవసాయ రంగంలోని 91 ట్రాక్టర్లు, 48 ఇతర యూనిట్లు ఉన్నాయ న్నా రు. ట్రాన్స్‌పోర్టు రంగంలో 89 యూనిట్లు, రిటైల్‌ రంగంలో 54 యూ ని ట్లు, సేవా రంగంలో 40 యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నా ర న్నారు. కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌, జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ రమణ, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ దళితుల సంక్షేమానికి చేస్తున్న కార్యక్రమా లను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ లక్ష్మినారాయణ, జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ గొల్లపల్లి చంద్రశేఖర్‌ గౌడ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎలాల శ్రీకాంత్‌, జిల్లాలోని పలు మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యు లు, ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:59:22+05:30 IST