దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-05-18T05:41:43+05:30 IST

పర్యావరణహిత విద్యుత ఉత్పత్తిలో కర్నూలు జిల్లా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం జగన అన్నారు.

దేశానికే ఆదర్శం

  1.  పర్యావరణహిత విద్యుత ఉత్పత్తిలో కర్నూలు
  2.  గుమ్మితం తండా, పిన్నాపురానికి ప్రత్యేక గుర్తింపు
  3.  5,230 మెగావాట్స్‌ ఉత్పత్తి లక్ష్యంగా..
  4.  ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక విద్యుత స్టోరేజ్‌ ప్రాజెక్టు
  5.  కాంక్రీట్‌ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన 

కర్నూలు, మే 17 (ఆంధ్రజ్యోతి): పర్యావరణహిత విద్యుత ఉత్పత్తిలో కర్నూలు జిల్లా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం జగన అన్నారు. ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా దగ్గర గ్రీనకో గ్రూపు సంస్థ 5,230 మెగావాట్ల సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత పునరుత్పాదక విద్యుత్తు స్టోరేజ్‌ ప్రాజెక్టు 4,766.28 ఎకరాల్లో చేపట్టారు. దీనికి సంబం ధించిన కీలకమైన కాంక్రీట్‌ పనులను సీఎం జగన మంగళవారం ప్రారంభించారు. అంతకు ముందు పైలానను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జగన మాట్లాడారు. తక్కువ ధరకే స్థిరమైన విద్యుత అందించడమే కాదు.. నిరంతరం క్లీన విద్యుత్తు అందిస్తుందని వివరించారు. సోలార్‌, పవన, పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత సముదాయం వల్ల డిమాండ్‌ తక్కువగా ఉన్న సమయంలో సోలార్‌, పవన విద్యుత్తును ఉపయోగించుకొని నీటిని అప్పర్‌ రిజర్వాయర్‌లోకి పంపింగ్‌ చేయడం...డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సమయంలో పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ఉత్పిత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ఒకే చోట హైడ్రో, సోలార్‌, విండ్‌ వపర్‌ ఉత్పత్తి ప్రాజెక్టు ఓర్వకల్లు మండ లంలో మంజూరు చేసినందుకు సీఎం జగనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతు న్నామని అన్నారు. గ్రీనకో గ్రూపు ఫౌండర్‌ సీఈవో, ఎమ్‌డీ అనిల్‌కుమార్‌ చలమసెట్టి మాట్లాడుతూ 15 రాష్ట్రా ల్లో గ్రీనకో గ్రూపు కంపెనీలు ఉన్నాయని తెలిపారు. భారతదేశంలోని అతిపెద్ద క్లీన ఎనర్జీ కంపెనీల్లో ఒకటని గుర్తు చేశారు. పిన్నాపురం ఇంటిగ్రేటెడ్‌ పున రుత్పాదక పవర్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సీఎం జగన అన్ని విధాలుగా సహకారం అందించారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినం దనలు తెలియజేస్తున్నానని అన్నారు. గ్రీనకో ఫౌండర్‌ ప్రెసిడెంట్‌, జా యింట్‌ ఎమ్‌డీ మహేష్‌ కొల్లి ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారు. వీరిద్దరికి సీఎం జగన ప్రాజెక్టు మొమెంటోను అందజేశారు. అనంతరం సీఎం జగన ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.  

సీఎంకు ఘన స్వాగతం

 ఓర్వకల్లు, మే 17: ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత (ఇంటిగ్రేటెడ్‌) పునరుత్పాదక విద్యుత ప్రాజెక్టు శంకుస్థాపన కోసం మంగళవారం ఓర్వకల్లుకు వచ్చిన సీఎం జగనకు ఘన స్వాగతం లభించింది. ఉదయం 10.42 గంటలకు ప్రత్యేక విమానంలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, జడ్పీ చైర్మన, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, కర్నూలు రేంజ్‌ డీఐజీ ఎస్‌.సెంథిల్‌ కుమార్‌ పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. ఓర్వకల్లు నుంచి గుమ్మితం తండా, సోలార్‌ పార్కు     శంకుస్థాపనను ముగించుకుని మధ్యాహ్నం 12.52 గంటలకు గన్నవరానికి బయలుదేరారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీసులతో ఎమ్మెల్యే శిల్పా వాగ్వాదం  

మండలంలోని గుమ్మితం తండా సోలార్‌ ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు ఆయన అనుచరుల వాహనాలను పోలీసులు కాల్వబుగ్గ రోడ్డులో అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే శిల్పా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి ఆదేశాల మేరకు తమ డ్యూటీలు చేస్తున్నామని పోలీసులు ఎమ్మెల్యేతో వాదనకు దిగారు. చివరకు ఎమ్మెల్యేను మాత్రం అనుమతించారు. 




Updated Date - 2022-05-18T05:41:43+05:30 IST