గ్రామాల్లోకి ఆదర్శం ‘మహగాం’

ABN , First Publish Date - 2022-05-05T04:44:36+05:30 IST

మండలంలోని ఓ మారు మూల ఆదివాసీ కుగ్రామం మహగాం. ఈ గ్రామం ఆధ్యాత్మికతకు, క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఈ గ్రామప్రజల ఆధ్యాత్మిక గురువు సూరోజీ బాబా. ఈయన ఈగ్రామానికి 1930వ సంవత్సరంలో మహా రాష్ట్ర నుంచి ఇక్కడి వచ్చారు.

గ్రామాల్లోకి ఆదర్శం ‘మహగాం’
మహగాం గ్రామం

- ఆదివాసీ గ్రామానికి జాతీమ స్థాయి గుర్తింపు
- సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజనలో 17వ ర్యాంక్‌
- ప్రభుత్వ సంక్షేమ పథకాల సద్వినియోగంలో ముందు
- మాంసం తినరు..మద్యం తాగరు..

సిర్పూర్‌(యూ), మే 4: మండలంలోని ఓ మారు మూల ఆదివాసీ కుగ్రామం మహగాం. ఈ గ్రామం ఆధ్యాత్మికతకు, క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఈ గ్రామప్రజల ఆధ్యాత్మిక గురువు సూరోజీ బాబా. ఈయన ఈగ్రామానికి 1930వ సంవత్సరంలో మహా రాష్ట్ర నుంచి ఇక్కడి వచ్చారు. ఆయన ఇక్కడి ప్రజలు చాలా వెనకబడి ఉన్నారని గ్రహించి వీరి కోసం తన వంతుగా ఏదైనా చేయాలని అనుకున్నారు. అను కున్నదే తడువుగా ప్రజలందరినీ ఆధ్యాత్మిక భావనలో నడిపారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయడం నేర్పించారు. వారిపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించారు. గ్రామస్థులసహకారంతో గ్రామంలో 1970లో పాఠశాల ఏర్పాటు చేసి విద్యనందించారు. ఈ పాఠశాల 1992 వరకు గురుదేవ్‌సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో కొనసా గింది. బాబా గురుదేవ్‌ సేవా ఆశ్రమం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు. ప్రస్తుతం ఇది నేటికి కొనసాగుతోంది. గ్రామస్థుల నుంచి సేకరించిన ధాన్యంతో పిల్లలకు భోజనవసతి కల్పించే వారు. ప్రతి ఏడాది శివరాత్రి పండుగకు ఖర్చులు తగ్గించడానికి సామూహిక వివాహాలు చేయడం నేటికీ ఇక్కడ కొన సాగుతూనే ఉంది. ఈ గ్రామంలో ఎవరూ మాంసా హారం తినరు. మద్యం తాగరు. గ్రామంలో ఎవరూ కోళ్లు, మేకలు పోషించరు. గ్రామస్థులంతా నేటికీ సూరోజీ బాబా ఆశయాలను కొనసాగిస్తూ ఆయన సూచించిన మార్గంలోనే నడుస్తున్నారు.
ప్రస్తుతం ఈగ్రామం సంసద్‌ఆదర్శ్‌ గ్రామీణ యోజన కింద ఎంపిక అయింది. దీంతో ఈ గ్రామా నికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసి అభివృద్ధి బాటపడుతోంది. గ్రామంలో సీసీరోడ్లు ఏర్పాటు చేశారు.అదేవిధంగా గ్రామం లో ప్రభుత్వ నిధులతో మురి కికాలువలు నిర్మించారు. రైతుల సమావేశాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రైతువేదిక నిర్మించుకున్నారు. పల్లెప్రకృతి వనం సకాలంలో పూర్తిచేసి ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నారు. ఏపని ఉన్నా గ్రామస్థులు సమష్టి నిర్ణయం తీసుకోని చేపడుతారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా అందరూ చర్చించి నిర్ణయం తీసుకుంటారు.      
ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తాం
- మడావి యాదవ్‌రావు, గామస్థుడు

గ్రామానికి మంజురైన పథకాలను పకడ్బందీగా అమలు చేస్తాం. అందరి నిర్ణ యంతోనే అభివృద్ధి బాటలో వెళుతున్నాం. అధికారుల ప్రోత్సాహం లభిస్తోంది. గ్రామంలో మద్యం తాగరు. మాసం తినరు. కొన్ని సంవత్సరాలుగా ఇది కొనసాగుతోంది. దురలవాట్లకు దూరంగా ఉంటాం.
అందరి సహకారంతోనే అభివృద్ధి
- ఆత్రం పద్మాబాయి, సర్పంచ్‌, మహగాం

అందరి సహకారంతోనే అభివృద్ధిలో ముందుకు వెళుతున్నాం. అధికారుల సహ కారం కుడా మాకు తోడుంది. ఏ పనులు చేపట్టినా గ్రామస్తులందరం కలిసి సమా వేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసు కుంటాం. గ్రామస్థులందరూ  దురల వాట్లకు దూరంగా ఉంటారు.

Read more