ఎస్పీ నకిలీ ఫేస్‌బుక్‌ నిందితుల గుర్తింపు

ABN , First Publish Date - 2020-11-30T04:12:14+05:30 IST

ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ పే రుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచిన నిందితుల కోసం పోలీసుల బృందం రాజస్థాన్‌లో గాలిస్తోంది.

ఎస్పీ నకిలీ ఫేస్‌బుక్‌ నిందితుల గుర్తింపు


రాజస్థాన్‌  వెళ్లిన జిల్లా పోలీసు బృందం 

స్థానిక పోలీసుల సహకారంతో విచారణ

అదుపులో ఎనిమిది మంది ?

ఒంగోలు(క్రైం), నవంబరు 29 : ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచిన నిందితుల కోసం  పోలీసుల బృందం రాజస్థాన్‌లో గాలిస్తోంది. ఇటీవల ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ తెరిచి కొంతమందిని నగదు బ్యాం క్‌లో వేయాలంటూ గుర్తుతెలియని అగంతకులు కోరారు. వెంటనే ఎస్పీ కార్యాలయ వర్గాలు గుర్తించి ఆ నకిలీ ఖా తాను బ్లాక్‌ చేశారు. అదే సమయంలో తాలుకా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసు లు అగంతకులను గుర్తించారు. రాజస్థాన్‌ రాష్ట్రం భరత్‌పూర్‌ జిల్లా జూహెగా పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని గ్రామస్థులుగా నిర్ధారణకు వచ్చారు. నాలుగురోజుల క్రితం ఒంగోలు నుంచి ఇద్దరు ఎస్‌ఐలతో కూడిన బృందం రాజస్థాన్‌ వెళ్లింది. అక్కడ పోలీసుల సహకారంతో నిందితుల ఆచూకీ కోసం గాలించారు.  ఓ గ్రామంలో నిందితులు ఉన్నారని తెలుసుకున్నారు. శనివారం రాత్రి ఆ స్థానిక పోలీసుల సహకారంతో ఆ గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అక్కడ వారు పోలీసులపై ఎదురు తిరిగి రాళ్లు రువ్వినట్లు సమాచారం. పోలీసులకఎలాంటి ఇబ్బంది కలగలేదని, వినియోగించిన వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిసింది. అయినప్పటికీ ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని అక్కడే విచారిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ఆదివారం తాలుకా ఇన్‌స్పెక్టర్‌ శివరామకృష్ణరెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా రాజస్థాన్‌కు ప్రత్యేక బృందం వెళ్లిన విషయం వాస్తవమేనని తెలిపారు. 

Updated Date - 2020-11-30T04:12:14+05:30 IST