ఉద్యోగులుగా గుర్తించాలి

ABN , First Publish Date - 2020-08-08T09:30:30+05:30 IST

అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తించి నెలకు రూ.21 వేల కనీస వేతనం ఇవ్వాలని ఎపీ అంగన్‌ ..

ఉద్యోగులుగా గుర్తించాలి

అంగన్‌వాడీ వర్కర్ల ఆందోళన

సమస్యలపై నినదించిన ఆశ వర్కర్లు

స్కీమ్‌ వర్కర్ల నిరసన ప్రదర్శన


అంగన్‌వాడీ, ఆశ, స్కీమ్‌ వర్కర్లు సమస్యలపై గళం విప్పారు. జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని అంగన్‌వాడీలు, సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్లు, కనీస వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వర్తింపచేయాలని స్కీమ్‌ వర్కర్లు డిమాండ్‌ చేశారు.


ఏలూరు ఫైర్‌స్టేషన్‌, ఆగస్టు 7 : అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తించి నెలకు రూ.21 వేల కనీస వేతనం ఇవ్వాలని ఎపీ అంగన్‌ వాడీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి, కోశాధికారి టి.పార్వ తి డిమాండ్‌ చేశారు. ఏలూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ ఉద్యోగులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, పెంక్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. కోవిడ్‌ డ్యూటీ చేసే ఉద్యోగులకు స్పెషల్‌ అలవెన్సులు ఇవ్వాలన్నారు. 


పోలవరం: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.భారతి డిమాండ్‌ చేశా రు. శుక్రవారం పోలవరంలో అంగన్వాడీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.


పెంటపాడు: సీఐటీయూ ఆధ్వర్యంలో పెంటపాడు సచివాలయం-1 వద్ద అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ నిరసన నిర్వహించారు. సిరపరపు రంగారావు, చిర్లాపుల్లారెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జె.శ్యామలాకుమారి, ఆర్‌.అనూరాధ, వి.కనకలక్ష్మి, నీరజ, సింహాచలం, సీత పాల్గొన్నారు.


కొవ్వూరు: ఐసీడీఎస్‌ ప్రాజెక్టు వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.శ్రీదేవి, సీహెచ్‌.మాణిక్యాంబ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి ఎ.నర్సమాంబ, పీవీ రమణ, సీత, లక్ష్మి వినతిపత్రం అందించారు.


భీమడోలు : అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమస్యలు పరిష్కరించాలంటూ భీమడోలు సీడీపీవో కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. 


చాగల్లు : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్లు శుక్రవారం వైద్యాధికారి కె.లక్ష్మీప్రియను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి కె.పోశమ్మ, సీఐటీయూ మండల కార్యదర్శి కె.దుర్గారావు మాట్లాడుతూ జూలై, ఆగస్టు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. డి.శ్రీదేవి, మంగతాయారు, కె.భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


ఉండ్రాజవరం: కరోనా నిర్మూలనకు పని చేస్తున్న సిబ్బందికి రక్షణ కల్పించాలని  సీఐటీయూ జిల్లా నాయకుడు పీవీ.ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఉండ్రాజవరంలో ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌, పీహెచ్‌సీ వైద్యాధికారులకు వినతిపత్రం అందజేశారు. రక్షణ కిట్‌లు, నెలకు రూ.25 వేలు అలవెన్స్‌ ఇవ్వాలని ఆయన కోరారు.


భీమవరం అర్బన్‌: స్కీమ్‌ వర్కర్స్‌కు పని భద్రత కల్పించి వేతనాలు పెంచాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్ర మం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయినరంగారావు, కిల్లరి మల్లేశ్వరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం కార్మికులు సర్వశిక్ష అభియాన్‌, ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వారిని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వన్ని డిమాండ్‌ చేశారు. అకలి రాము, పాల త్రిముర్తులు, యాకోబు, కె.కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T09:30:30+05:30 IST