వైరస్‌ వ్యాప్తి మూలాలు గుర్తించండి

ABN , First Publish Date - 2020-07-05T10:31:54+05:30 IST

కరోనా వైరస్‌ సంక్రమణ మూలాలను గుర్తించి, ఆ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని కొవిడ్‌-19 జిల్లా ప్రత్యేకాధికారి విజయానంద్‌..

వైరస్‌ వ్యాప్తి మూలాలు గుర్తించండి

కొవిడ్‌-19 ప్రత్యేకాధికారి విజయానంద్‌


అనంతపురం, జూలై4 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ సంక్రమణ మూలాలను గుర్తించి, ఆ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని కొవిడ్‌-19 జిల్లా ప్రత్యేకాధికారి విజయానంద్‌.. సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ నిశాంత్‌కుమార్‌, కంటైన్మెంట్‌ నోడల్‌ అధికారి, డీఎఫ్‌ఓ జగన్నాథ్‌సింగ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, శిక్షణ డీఎ్‌ఫఓ చైతన్యతో కలిసి ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అమలు పరచాల్సిన కంటైన్మెంట్‌ ఆపరేషన్స్‌, కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్షించారు.  విజయా నంద్‌ మాట్లాడుతూ అన్‌లాక్‌-1, 2 తరువాత ప్రజల రాక పోకలు పెరగటంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా కేసులు అధికంగా నమో దవుతున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నాలుగు జిల్లాల్లో అనంత ఉందన్నారు.


కరోనా వైరస్‌ సంక్రమణ మూలాలను గుర్తించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా గూమికూడే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రజలు ఒకే సారి సంచరించకుండా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ శాఖలు సమన్వయం చేసుకుంటూ జిల్లాలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. పట్టణాల్లో షాపుల వద్ద కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటు న్నారా, లేదా పరిశీలించాలన్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కంటైన్మెంట్‌ కార్యకలాపాలు కఠినంగా అమలు చేయాలన్నారు.


పాజిటివ్‌ వచ్చిన వారిలో 50 సంవత్సరాలలోపు ఉన్న వారిని ఇళ్ల వద్ద సౌకర్యాలుంటే హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంచాలన్నారు. అంతకంటే వయసు ఎక్కువ ఉన్న వారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉంచా లన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారందరినీ కొవిడ్‌ ఆస్పత్రులకు పంపాలన్నారు. కొత్తగా కేసులు నమోదవు తున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసి, రాకపోకలను నిషేధించాలన్నారు. మాస్కు లు ధరిం చకపోతే జరిమానా విధించటంతోపాటు క్వారంటైన్‌లో ఉంచుతామని హెచ్చరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌, అదనపు డీఎంహెచ్‌ఓ పద్మావతి, డీసీహెచ్‌ఎ్‌స రమేష్‌, జిల్లా నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T10:31:54+05:30 IST