మాస్క్ పెట్టుకోనందుకు ‘ఇడియట్స్’ అని తిట్టిన ప్రధాని

ABN , First Publish Date - 2022-01-07T23:46:12+05:30 IST

కొవిడ్ మూడో వేవ్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. కొవిడ్ మూడో వేవ్ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్న దేశాల్లో కెనడా ముందు వరుసలో ఉంది. కెనడా వ్యాప్తంగా ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టింది. మాస్క్‌లు ధరించడం, వ్యాక్సీన్ తీసుకోవడం..

మాస్క్ పెట్టుకోనందుకు ‘ఇడియట్స్’ అని తిట్టిన ప్రధాని

టొరంటో: మద్యం సేవిస్తూ, పొగ తాగుతూ, పిచ్చాపాటిగా డాన్స్‌లు చేస్తూ కెనడాకు చెందిన కొంత మంది విమానంలో తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీరిని ‘ఇడియట్స్’ అని సంబోధిస్తూ ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం ఆ విమానంలో ఉన్నవారికి ఎవరికీ మాస్క్‌లు లేకపోవడం. మాస్క్‌లు ధరించకుండా ఎలాంటి కొవిడ్ నిబంధనలు పాటించుకుండా అలా పార్టీలు చేసుకోవడంపై ప్రజల నుంచి సైతం అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక ఎయిర్‌లైన్స్ అయితే వారిని తమ విమానాల్లో ప్రయాణానికి అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పాయి.


కొవిడ్ మూడో వేవ్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. కొవిడ్ మూడో వేవ్ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్న  దేశాల్లో కెనడా ముందు వరుసలో ఉంది. కెనడా వ్యాప్తంగా ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టింది. మాస్క్‌లు ధరించడం, వ్యాక్సీన్ తీసుకోవడం, ఎక్కువ మంది ఒక చోట చేరకుండా ఉండడంతో పాటు మరికొన్ని నిబందనలు అమలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో కొవిడ్ నిబంధనలేమీ పాటించుకుండా కొంత మంది ఇలా విమానంలో పార్టీ చేస్తూ కనిపించడం దుమారం లేపింది. బుధవారం మీడియాతో ప్రధాని ట్రూడో మీడియాతో మాట్లాడుతుండగా మీడియా ఈ విషయాన్ని ప్రస్తావించింది. దీనికి ఆయన స్పందిస్తూ ‘‘ఆ వీడియో నేను కూడా చూశాను. చాలా కోపం వచ్చింది. కొవిడ్ మూడో వేవ్ వ్యాపిస్తోంది. అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ కొవిడ్ అడ్డుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. క్రిస్టమస్ సమయంలో కూడా వేడుకలు చిన్నగా చేసుకున్నారు. కానీ ఆ విమానంలోని ఇడియట్స్‌‌కి ఇవేవీ పట్టట్లేదు’’ అని అన్నారు.

Updated Date - 2022-01-07T23:46:12+05:30 IST