సంతబొమ్మాళిలో విగ్రహ రగడ

ABN , First Publish Date - 2021-01-17T06:04:03+05:30 IST

సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయ ప్రాం గణంలో విగ్రహాల ధ్వంసం ఘటన మరువక ముందే...పాలేశ్వరస్వామి ఆలయ జంక్షన్‌లో విగ్రహ రగడ చోటుచేసు

సంతబొమ్మాళిలో విగ్రహ రగడ
సిమెంట్‌ దిమ్మెను తొలగిస్తున్న దృశ్యం




వివాదాస్పద సిమెంట్‌ దిమ్మెను తొలగించిన పోలీసులు

సంతబొమ్మాళి, జనవరి 16:
సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయ ప్రాం గణంలో విగ్రహాల ధ్వంసం ఘటన మరువక ముందే...పాలేశ్వరస్వామి ఆలయ జంక్షన్‌లో విగ్రహ రగడ చోటుచేసుకుంది. జంక్షన్‌లోని సిమెంట్‌ దిమ్మెపై శనివా రం నంది విగ్రహం వెలిసింది. ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకేనంటూ వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో శనివారం రాత్రి డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వివాదాస్పదమైన సిమెంట్‌ దిమ్మెను తొలగించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.  
కోటబొమ్మాళి-సంతబొమ్మాళి-నౌపడ ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణలో భాగంగా పాలేశ్వర స్వామి జంక్షన్‌ సమీపంలో రోడ్డు మధ్యలో ఎర్రన్నాయుడు విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. సిమెంట్‌ దిమ్మెను ఏర్పాటుచేశారు. ఇంతలో ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో విగ్రహ ఏర్పాటు నిలిచి పోయింది. అయితే ఇటీవల సిమెంట్‌  దిమ్మెపై వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో అదే దిమ్మెపై రాత్రికి రాత్రి నంది విగ్రహం వెలిసింది. దీనిపై వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారని.. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రోత్సహం తో టీడీపీ నాయకులు ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం సంతబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కాశీబుగ్గ డీఎస్పీ శివరా మిరెడ్డి స్పందించారు. నంది విగ్రహాన్ని గతంలో ఉన్న చోటుకు తరలించారు. వివాదానికి కారణమైన సిమెంట్‌ దిమ్మెను తొలగించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా టెక్కలి సిఐ నీలయ్య, ఎస్‌ఐ గోవింద బందోబస్తు నిర్వహించారు.




Updated Date - 2021-01-17T06:04:03+05:30 IST