అక్రమ నిర్మాణాన్ని తొలగించండి

ABN , First Publish Date - 2022-01-18T06:24:05+05:30 IST

అక్రమ నిర్మాణాన్ని తొలగించండి

అక్రమ నిర్మాణాన్ని తొలగించండి
మునిసిపల్‌ చైర్మన్‌ రాఘవేంద్రకు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ కౌన్సిలర్లు

ఐడీఎస్‌ఎంటీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అక్రమ కట్టడంపై చైర్మన్‌, కమిషనర్లకు టీడీపీ కౌన్సిలర్ల వినతి

జగ్గయ్యపేట, జనవరి 17: ఐడీఎస్‌ఎంటీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని, కబ్జాదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు  సోమవారం మునిసిపల్‌ కమిషనర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్రను కలిసి వినతిపత్రం అందచేశారు.  అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. గతంలో కాంప్లెక్స్‌లో అక్రమ నిర్మాణాన్ని కడుతుంటే గమనించి అధికారుల దృష్టికి తీసుకెళితే..తాత్కాలికంగా పనులు ఆపారని వారన్నారు. సంక్రాంతి పండుగకు ముందు పనులు చేస్తుంటే తాము గుర్తించి అడ్డుకున్నామన్నారు. మునిసిపల్‌ కాంప్లెక్స్‌లోనే ఇలా జరుగుతున్నా పాలకవర్గం, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అక్రమ కట్టడాన్ని తొలగించి, కబ్జాకు యత్నించిన వ్యక్తిపై క్రిమినల్‌ కేసు పెట్టి భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా గట్టి హెచ్చరిక జారీ చేయాలని కోరారు. సామినేని మనోహర్‌, పేరం సైదేశ్వరరావు, సూర్యదేవర ఉషారాణి, కంచేటి రాణి, ఇర్రి నరసింహారావు, నకిరికంటి వెంకట్‌, సంగెపు బుజ్జి, గొట్టి నాగరాజు, గెల్లా సంధ్యారాణి వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. మునిసిపల్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు.


Updated Date - 2022-01-18T06:24:05+05:30 IST