ఎస్‌ఆర్‌కేఆర్‌కు ఐడీయూ ల్యాబ్‌ మంజూరు

ABN , First Publish Date - 2021-06-17T05:03:46+05:30 IST

ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించిన ఐడీయూ (ఆలోచన వృద్ధి, విశ్లేషణ చేయటం) ల్యాబ్‌ మంజూరైనట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్‌ఆర్‌కేఆర్‌కు ఐడీయూ ల్యాబ్‌ మంజూరు
ల్యాబ్‌పై వివరిస్తున్న ప్రిన్సిపాల్‌, సెక్రటరీ

భీమవరం ఎడ్యుకేషన్‌, జూన్‌ 16: ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించిన ఐడీయూ (ఆలోచన వృద్ధి, విశ్లేషణ చేయటం) ల్యాబ్‌ మంజూరైనట్టు  కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  దేశంలో 49 కళాశాలలను ఎంపిక చేయగా అందులో ఎస్‌ఆర్‌కేఆర్‌ ఒకటని,  మౌలిక వసతుల  కల్పనకు సుమారు రూ. కోటి ఏఐసీటీఈ మంజూరు చేస్తుందన్నారు.  విద్యార్థి స్వయం విజ్ఞానాన్ని సంపాదించి మేకిన్‌ ఇండియాలో భాగస్వాములు కావటమే ల్యాబ్స్‌  లక్ష్యమన్నారు.  ఐడియూ ల్యాబ్‌కు చీఫ్‌ మెంటార్‌గా కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఎం జగపతిరాజు, కోఆర్డినేటర్‌గా డాక్టర్‌ ఎన్‌. గోపాలకృష్ణమూర్తి, కో–కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మోహన్‌ వ్యవహరిస్తారన్నారు. కళాశాల సెక్రటరీ రంగరాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T05:03:46+05:30 IST