పరిహారం ఇవ్వకుంటే ఎన్నికలో నిలబడతాం

ABN , First Publish Date - 2022-10-08T05:49:06+05:30 IST

చర్లగూడెం రిజర్వాయర్‌లో భూము లు కోల్పోయిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలని, లేకుం టే ఉప ఎన్నికలో నిలబడతామని బాధితులు కొత్త లొంకయ్య, కా రింగు జంగయ్య పలువురు నిర్వాసితులు తెలిపారు.

పరిహారం ఇవ్వకుంటే ఎన్నికలో నిలబడతాం
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న భూ నిర్వాసిత రైతులు

భూనిర్వాసితుల హెచ్చరిక 

మర్రిగూడ, అక్టోబరు 7: చర్లగూడెం రిజర్వాయర్‌లో భూము లు కోల్పోయిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలని, లేకుం టే ఉప ఎన్నికలో నిలబడతామని బాధితులు కొత్త లొంకయ్య, కా రింగు జంగయ్య పలువురు నిర్వాసితులు తెలిపారు. మునుగోడులో జరగనున్న ఉప ఎన్నికలో భూములు కోల్పోయిన 80మంది రైతు లు కలిసి నామినేషన్లు వేయనున్నట్లు బాధితులు కొత్త లొంకయ్య, కారింగు జంగయ్య పలువురు నిర్వాసితులు తెలిపారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన అజిలాపురం, రాంరెడ్డిపల్లి, శివన్నగూడ, ఖుదాభక్షపల్లి గ్రామాల రైతులు మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్ష శుక్రవానికి 37వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా చర్లగూ డెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. మా డిమాండ్లను పరిష్కరించాలని 37 రోజులుగా దీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పం దించి డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు పోయిన రైతులకు వెంటనే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించి దీక్షను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఉ ప ఎన్నికలో పాల్గొననున్నట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-10-08T05:49:06+05:30 IST