అలా చేస్తే... సర్వీసులుండవు... వాట్సాప్... మరో ట్విస్ట్...

ABN , First Publish Date - 2021-05-11T21:24:07+05:30 IST

ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఆయా వాట్సాప్ సర్వీసులను ఇకపై పొందలేము.

అలా చేస్తే... సర్వీసులుండవు... వాట్సాప్... మరో ట్విస్ట్...

క్యాలిఫోర్నియా : ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఆయా వాట్సాప్ సర్వీసులను ఇకపై పొందలేము. ఆయా నిబంధనలను ఈ నెల(మే) 15 లోగా అంగీకరించనిపక్షంలో... సదరు ఖాతాలు డెలీట్ కానున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సేవా నిబంధనలు, ప్రైవసీ విధానాన్ని జనవరిలో వాట్సాప్ అప్‌డేట్ చేసిన విషయం తెలిసిందే.  


వివరాలిలా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మార్పుల గురించి తమ వినియోగదారులకు తెలియజేసిన వాట్సాప్... అదే క్రమంలో నోటిఫికేషన్స్ పంపడాన్ని కూడా ప్రారంభించింది. ఆ తర్వాత యూజర్ ప్రైవసీ విధానం మీద వెల్లువెత్తిన విమర్శల నేపధ్యంలో వాట్సప్ వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. కాగా... తాజాగా వాట్సప్ మరికొన్ని నిర్ణయాలను తీసుకుంది. వివరాలిలా ఉన్నాయి.  ఈ నెల(మే) 15 తర్వాత ప్రైవసీ పాలసీ నిబంధనలను అంగీకరించకపోయినప్పటికీ... సదరు ఖాతాలు డెలీట్ కావు.. అయితే సర్వీసులు మాత్రం తగ్గిపోతాయి. 


అంటే... కొత్త నిర్ణయాల నేపధ్యంలో.... కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే... కొన్ని వారాల తర్వాత చాట్ లిప్ట్ కనిపించదు. అంతేకాదు... కొన్నాళ్ళ తర్వాత వాట్సాప్ కాలింగ్ కూడా నిలిచిపోతుంది. అప్పటికైనా... పాలసీకి ఒకే చెప్పనట్లైతే... కొన్ని వారాల తర్వాత రిమైండర్లు మారిపోతూ ఉంటాయి. అప్పటికీ పాలసీకి ఆమోదం చెప్పకపోతే... కాల్స్, మెసేజ్‏లు కూడా ఆగిపోతాయి. మొత్తంగా చూస్తే... ఎలాగోలా ప్రైవసీ పాలసీని ఆమోదించుకునేలా వాట్సాప్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.  ప్రైవసీ పాలసీ విధానంపై మొదట్లో పెద్దఎత్తున విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో వాట్సాప్ తరహాలోనే ఇతర యాప్స్ వాడకం కూడా ఊపందుకుంది. ఈ నేపధ్యంలో... వాట్సప్ యూజర్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 


ఇక కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో మే 15 తర్వాత అకౌంట్లు డెలీట్ కావు.. కానీ సర్వీసులు తగ్గిపోతాయి. కొత్త పాలసీకి సంబంధించి రిమైండర్ వచ్చినప్పుడు నేను దాన్ని ఓకే చెయ్యకపోతే… అప్పుడు ఏమవుతుందన్న ప్రశ్నకు... ‘అలా చేస్తే… మీకు సర్వీసులు తగ్గిపోతాయి. మీరు ఆమోదించేవరకూ సర్వీసుల్లో కోత ఉంటుంది. మీరు చాట్ లిస్ట్ చూడలేరు, మీకు వచ్చే వాట్సాప్ ఫోన్ కాల్స్‌, వీడియో కాల్స్‌కి మీరు బదులివ్వలేరు, అలాగే గ్రూపుల నుంచి మీ నంబర్ తొలగించబడుతుంది, అంతేకాకుండా...  వాట్సాప్ బ్యాకప్ సర్వీసును కూడా కోల్పోతారు’ అని వాట్సాప్ స్పష్టం చేసింది. 

Updated Date - 2021-05-11T21:24:07+05:30 IST