ఇక్కడ ఖాతా మొదలెడితే... రెండు నెలల జీతం + రూ. 30 లక్షల బెనిఫిట్...

ABN , First Publish Date - 2021-05-11T21:57:51+05:30 IST

ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో శాలరీ అకౌంట్ ఉంటే... పలు రకాల ప్రయోజనాలుంటాచిజ రూ. 30 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నది వాటిలో ప్రధానమైన విషయం. మరోవైపు... ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు కూడా ఉంటుంది.

ఇక్కడ ఖాతా మొదలెడితే... రెండు నెలల జీతం + రూ. 30 లక్షల బెనిఫిట్...

ముంబై : ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో శాలరీ అకౌంట్ ఉంటే... పలు రకాల ప్రయోజనాలుంటాచిజ రూ. 30 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నది వాటిలో ప్రధానమైన విషయం. మరోవైపు... ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు కూడా ఉంటుంది. ఎస్‌బీఐ శాలరీ అకౌంట్ కలిగిన వారికి యాక్సిడెంటల్ డెత్ కవర్ లభిస్తుంది. రూ. 20 లక్షల వరకు ప్రమాద బీమా వస్తుంది. ఇకవేళ... విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. 30 లక్షల వరకు ప్రమాద బీమా వస్తుంది. ఇక... లోన్ ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రిబేటు వస్తుంది. రెండు నెలల వేతనాన్ని ముందే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద తీసుకోవచ్చు.


ఇంకా ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ కలిగిన వారికి లాకర్ చార్జిల్లో కూడా మినహాయింపు ఉంటుంది. బ్యాంక్ 25 శాతం వరకు తగ్గింపు ఆఫర్‌నిస్తోంది. ఇంకా ఉచిత నెఫ్ట్/ఆర్‌టీజీఎస్ లావాదేవీలను నిర్వహించుకునే వెసులుబాటుండడం మరో ప్రయోజనం. అంతేకాదు... ఏటీఎం లావాదేవీలు  కూడా పూర్తి ఉచితం. న్నిసార్లైనా తంగానే. ఎస్ఎంఎస్ అలర్ట్స్, మల్టీ సిటీ చెక్స్ వంటి పలు రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అవీ ఉచితంగానే. 

Updated Date - 2021-05-11T21:57:51+05:30 IST