కమీషన ఇస్తేనే.. లేకుంటే పనులు నిలిపెయ్‌..

ABN , First Publish Date - 2022-01-21T06:10:31+05:30 IST

అధికార వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారు. కమీషన కోసం ఎంతటికైనా దిగజారుతున్నా రు. తాము అడిగిన మొత్తం ఇస్తేనే పనులు చేయాలనీ, లేకుంటే నిలిపివేయాలని హుకుం జారీ చేశారు.

కమీషన ఇస్తేనే..  లేకుంటే పనులు నిలిపెయ్‌..
పనులను అడ్డుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న కార్పొరేటర్‌

- వైసీపీ నాయకుల దౌర్జన్యం..!

- కాంట్రాక్టర్‌కు బెదిరింపులు

- 30వ డివిజన కార్పొరేటర్‌, నాయకుల జోక్యం..

- విద్యుతనగర్‌ రోడ్డు పనులు అడ్డగింపు

అనంతపురం కార్పొరేషన, జనవరి20: అధికార వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారు. కమీషన కోసం ఎంతటికైనా దిగజారుతున్నా రు. తాము అడిగిన మొత్తం ఇస్తేనే పనులు చేయాలనీ, లేకుంటే నిలిపివేయాలని హుకుం జారీ చేశారు. అనంతపురం నగరంలో కాంట్రాక్టర్‌పై దౌర్జన్యానికి దిగారు. గురువారం నగరంలోని విద్యుతనగర్‌ నుంచి నవోదయకాలనీ వరకు (జేఎన్టీయూ రోడ్డును క్రాస్‌ చేస్తూ) చేపడుతున్న ఈ పనులను అడ్డుకున్నారు. 2018లో టెండరు పూర్తయి అగ్రిమెంట్‌ కుదిరినా నాలుగేళ్లుగా నిధులు, ఇతర సమస్యలతో ఈ రోడ్డు ప నులు పూర్తి కాలేదు. ఎట్టకేలకు ఎమ్మెల్యే, మేయర్‌, కమిషనర్‌ ప్రత్యేక దృష్టి సారించి, రోడ్డు పనులు ప్రారంభమయ్యేలా చూశారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు కమీషన్ల కోసం అడ్డుకుంటున్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద 1.6 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులను 6.8 కోట్లతో చేపడుతున్నారు. 30వ డివిజన కార్పొరేటర్‌ నరసింహులు, అ క్కడి నాయకులు బలరాం, బాబు.. కమీషన ఇవ్వాలని బెదిరిస్తున్నారనీ, అందుకోసమే రోడ్డు పనులు అడ్డుకున్నారని కాంట్రాక్టర్‌ శ్రీకాంత ఆరోపించారు. కాంట్రాక్టు కేఎంవీ సంస్థకు దక్కగా.. జేకేఎస్‌ సంస్థ సబ్‌ కాం ట్రాక్టు తీసుకుంది.  వాస్తవానికి పదిరోజులుగా ఈ రోడ్డు పనుల్లో వేగం పుంజుకుంది. బుధవారం సాయంత్రం 30వ డివిజనకు చెందిన ఓ వైసీపీ నాయకుడు.. కాంట్రాక్టర్‌ను రప్పించుకున్నాడట. తమ ఏరియాలో పనులు చేస్తున్నారనీ, ఏమన్నా చూసుకోవా లి కదా అన్నాడట. రూ.30 లక్షలు ఖర్చు చేశామనీ, తమకు ఎవరూ ఫం డ్‌ కూడా ఇవ్వలేదనీ, 10 శాతమైనా కమీషన ఇవ్వాలని చెప్పుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ కాంట్రాక్టర్‌... అలా డబ్బు ఎవరికీ ఇవ్వలేదనీ, కుదరదని చెప్పాడట. దీంతో గురువారం ఉదయం పనులు జరుగుతున్న సమయంలో బలరాం, బాబు, కొందరు వ్యక్తులు పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. కాంట్రాక్టర్‌ ఒప్పుకోకపోవడంతో మరింత మందితో వచ్చి, పనులు నిలిపివేయాలని హుకుం జారీ చేశారు. కాంట్రాక్టర్‌, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం సాగుతున్నంతసేపు ఆ డివిజన కార్పొరేటర్‌ నరసింహులు వారి వెనుకే ఉండి వారినే గమనిస్తున్నారు. ఆయన ఆ గొడవ ను అడ్డుకోలేదంటే.. పనులు నిలిపివేయడం వెనుక ఆయనే ఉండి  నడిపిస్తున్నారనుకోవాలా..? బాధ్యత ఉండి కూడా చోద్యం చూస్తున్నారనుకోవాలా...?

కౌన్సిలర్‌ ఎక్కడికి పోవాల...?

వాగ్వాదం తరువాత కాంట్రాక్టర్‌ మాట్లాడుతూ... ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అభివృద్ధి చేయాలని కోరితే పనులు వేగం చేస్తున్నా మన్నారు. ఎవరికీ కమీషన్లు ఇచ్చే ఉద్దేశంతో చేయడం లేదన్నారు. వైసీపీ నాయకుడు మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చు పెట్టాం. ఇప్పుడో ఎవరో వచ్చి పనులు చేస్తే ఎలా? పార్టీ పునాది నుంచి పనిచేశాం. కౌన్సిలర్‌ ఎక్కడికి పోవాల...?’ అని ప్రశ్నించాడు. ఇంత వివాదం రేపిన ఈ విషయంపై ఎవరెలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.


Updated Date - 2022-01-21T06:10:31+05:30 IST