ఫోన్‌ పే చేస్తేనే.. యూరియా!

ABN , First Publish Date - 2021-07-22T05:09:35+05:30 IST

‘ఎరువులు కావాలంటే ముందుగా ఫోన్‌ పే చేయాలి. లేకపోతే ఎరువులు ఇచ్చేది లేదు’ అంటూ రైతు భరోసా కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది తెగేసి చెబుతున్నారు. దీంతో రైతులు అయోమ యానికి గురవుతున్నారు. కొందరి దగ్గర ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు లేక.. డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారు. ఫోన్‌ పే అంటే ఏమిటో కూడా తమకు తెలియదని కొందరు రైతులు వాపోతున్నారు.

ఫోన్‌ పే చేస్తేనే.. యూరియా!
జగతి ఆర్‌బీకే వద్ద ఆందోళన చెందుతున్న రైతులు

 రైతుభరోసా కేంద్రాల్లో కొత్త మెలిక

 లబోదిబోమంటున్న రైతులు

కవిటి, జూలై 21 : ‘ఎరువులు కావాలంటే ముందుగా ఫోన్‌ పే చేయాలి. లేకపోతే ఎరువులు ఇచ్చేది లేదు’ అంటూ రైతు భరోసా కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది తెగేసి చెబుతున్నారు. దీంతో రైతులు అయోమ యానికి గురవుతున్నారు. కొందరి దగ్గర ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు లేక.. డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారు. ఫోన్‌ పే అంటే ఏమిటో కూడా తమకు తెలియదని కొందరు రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులు ఎరువుల కోసం రైతుభరోసా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ నగదు లావాదేవీలు లేవని, ఫోన్‌ పే చేయాలని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఫోన్‌ వాడడమే తమకు సరిగ్గా తెలియదని, ఇక ఫోన్‌ పే ద్వారా ఎలా డబ్బులు చెల్లించగలమని సాధారణ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమాయక రైతులతో ప్రభుత్వం ఆటలాడుకోవడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు. ఆర్‌బీకేల వద్ద ఎరువులు కొనలేక ప్రైవేటు డీలర్లను కొంతమంది రైతులు ఆశ్రయిస్తున్నారు. 


ప్రభుత్వ ఆదేశాల మేరకే..

నగదు రహిత లావాదేవీలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు  ఎరువుల విషయంలో కూడా ఫోన్‌ పే ద్వారా నగదు చెల్లించాలని చెబుతున్నాం. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ప్రతి ఇంట్లో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడుతున్నారు. మొదట్లో ఇబ్బంది అనిపించినా, తర్వాత అదే అలవాటవుతుంది.

- ప్రసాద్‌, వ్యవసాయాధికారి, కవిటి

Updated Date - 2021-07-22T05:09:35+05:30 IST