వర్షాలొస్తే ఆ గ్రామాలకు దారి బంద్‌

ABN , First Publish Date - 2022-08-15T05:23:31+05:30 IST

వర్షాలు వస్తే మండలంలోని నారప్పగారిపల్లి వద్ద సోమావతి నదిపై నిర్మించిన వంతెనపై నుంచి నీరు పారుతూ ఉంటుంది.

వర్షాలొస్తే ఆ గ్రామాలకు దారి బంద్‌
ఇటీవల వర్షాలకు వంతెనపై నుంచి పారుతున్న వరద (ఫైల్‌)

వంతెనపై నుంచి నీరు వెళ్తుండటంతో పది గ్రామాల వాసులకు తప్పని ఇబ్బందులు

ఓబుళదేవరచెరువు, ఆగస్టు 14 : వర్షాలు వస్తే మండలంలోని నారప్పగారిపల్లి వద్ద సోమావతి నదిపై నిర్మించిన వంతెనపై నుంచి నీరు పారుతూ ఉంటుంది. దీంతో రామిరెడ్డిప ల్లి, శెట్టివారిపల్లి, బొడెద్దులవారిపల్లి, నారప్పగా రిపల్లి, వెంకటాపురం, మల్లెంవాండ్లపల్లి, బోగానిపల్లి, బావాసాబ్‌పల్లి తదితర గ్రామాల కు ప్రధాన రహదారి బంద్‌ అవుతుంది. ఇక ఆ వరద తగ్గే వారకూ వారు ఆయా గ్రామాలకు పరిమి తం కావాల్సిందే. ఆ సమయంలో ఎవరి కైనా అనారోగ్యం చేస్తే ఇక అంతే సంగతే. ఆ వంతెన ఎత్తు పెంచాలని పలుమార్లు  విజ్ఞప్తి చేసినా పాలకులు, అధికారులు పట్టించు కోలే దని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. గాజుకుం టపల్లి నుంచి రామిరెడ్డిపల్లికి వెళ్లడానికి పాత రహ దారి కోతకు గురికావడంతో ప్రస్తుతం ఆ ప్రాం తవాసులూ నారప్పగారిపల్లి మీదుగానే గ్రామాలకు వెళ్లాల్సివస్తోంది. ఇప్పటికైనా అధి కారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆ వం తెన ఎత్తును పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2022-08-15T05:23:31+05:30 IST