చెప్పకపోతేసమస్యలు ఎలా తెలుస్తాయి ?

ABN , First Publish Date - 2022-06-25T05:40:47+05:30 IST

గృహ నిర్మాణ పథకం అమలులో ఎక్కడైనా సమస్యలుంటే ముందుగా చెప్పకపోతే ఎలా అని కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ప్రశ్నించారు.

చెప్పకపోతేసమస్యలు ఎలా తెలుస్తాయి ?
హౌసింగ్‌ సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి


ప్రజాప్రతినిధులు అడిగే వరకు ఉండాలా?

హౌసింగ్‌ సమీక్షలో కలెక్టర్‌ సీరియస్‌

అనంతపురం టౌన, జూన 24: గృహ నిర్మాణ పథకం అమలులో  ఎక్కడైనా సమస్యలుంటే ముందుగా చెప్పకపోతే ఎలా అని కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స ద్వారా హౌసింగ్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ప్రతివారం సమీక్ష చేసుకుంటున్నా మన్నారు. ఆ సమయంలో అంతా బాగుందని అధికారులు చెబుతున్నారు. సమావేశాలలో మాత్రం ప్రజాప్రతినిధులు సమస్యలు ఇవిగో అంటూ వినిపిస్తున్నారన్నారు. ఉరవకొండలో ఇసుక సమస్య ఉందని ప్రజాప్రతినిధులు జడ్పీ మీటింగ్‌లో లేవనెత్తే వరకు తన దృష్టికి అధికారులు తీసుకురాకపోవడంపై కలెక్టర్‌ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా సమస్య ఉంటే చెబితే కదా పరిష్కారం చూపేదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రశ్నించే వరకు జిల్లా అధికార యంత్రాంగం సమస్యలు తెలుసుకోకపోవడం సరికాదన్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన స్టీల్‌, సిమెంట్‌ ఇతర సామగ్రి పుష్కలంగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇసుక సమస్య, బిల్లులు ఆలస్యం కావడం వంటి సమస్యలు కూడా లేవన్నారు. అధికారులు బ్యాంక్‌ లింకేజి ఇబ్బందులు, సీఎ్‌ఫఎంఎస్‌ సమస్య పరిష్కరిస్తే మరింత త్వరగా బిల్లులు అందుతాయన్నారు.  ఓటీఎ్‌సకు సంబంధించి కొత్తగా అందిన 1092 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన చేసి లబ్ధిధారులకు అందించాలన్నారు. సమావేశంలో అనసెట్‌ సీఈఓ కేశవనాయుడు, హౌసింగ్‌ పీడి రాజశేఖర్‌, జడ్‌పి సీఈఓ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-25T05:40:47+05:30 IST