బ్యాంకు మోసాల నుంచి దేశం బయటపడుతుందా?: మాయావతి

ABN , First Publish Date - 2022-02-15T21:32:54+05:30 IST

దేశంలో చాలా కాలంగా తీవ్ర పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలతో ప్రజలు ఉపాధికి దూరమవుతున్నారు. కొత్తగా ఉపాధి కల్పించే మాట అంటుంచితే ఇప్పటికే ఉన్న ఉపాధి అవకాశాలను చాలా మంది కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగ కల్పన గురించి ప్రకటనలు వస్తాయనుకుంటే..

బ్యాంకు మోసాల నుంచి దేశం బయటపడుతుందా?: మాయావతి

లఖ్‌నవూ: దేశంలో ఒకవైపు పేదరికం, నిరుద్యోగం, మౌలిక వసతుల లేమి విళయ తాండవం చేస్తుంటే మరొకవైపు బ్యాంకు మోసాలు యదేచ్ఛగా జరుగుతున్నాయని బహుజన్ సమాజ్‌ పార్టీ సుప్రెమో మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బ్యాంకు మోసాల నుంచి మన దేశం బయటపడుతుందా అంటూ ఆమె ప్రశ్నించారు. తాజాగా వెలుగు చూసిన 23 వేల కోట్ల బ్యాంకు మోసం గురించి సోషల్ మీడియా వేదికగా మాయావతి స్పందించారు.


‘‘దేశంలో చాలా కాలంగా తీవ్ర పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలతో ప్రజలు ఉపాధికి దూరమవుతున్నారు. కొత్తగా ఉపాధి కల్పించే మాట అంటుంచితే ఇప్పటికే ఉన్న ఉపాధి అవకాశాలను చాలా మంది కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగ కల్పన గురించి ప్రకటనలు వస్తాయనుకుంటే కుంభకోణాల గురించి వినాల్సి వస్తంది. తాజాగా 23 వేల కోట్లు బ్యాంకు కుంభకోణం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంతో ప్రజల్లో అనేక రకాల సందేహాలు తలెత్తుతున్నాయి. బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడానికి ప్రజలు భయపడుతున్నారు. ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదు. కుంబభకోణాల నుంచి మన దేశ బ్యాంకులు బయటపడతాయా?’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

Updated Date - 2022-02-15T21:32:54+05:30 IST