సమస్యలు పరిష్కరించకుంటే పోరాటమే

ABN , First Publish Date - 2022-06-28T04:59:11+05:30 IST

మదనపల్లె మండలం పోతబోలు పంచాయ తీలోని 200కుటుంబాల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు చేయ డం తోపాటు నిరాహారదీక్షలు తప్పవని స్థానిక ప్రజలతోపాటు జనసేన పార్టీ నేత మైఫోర్స్‌ మహేష్‌ పేర్కొన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటమే
స్పందనలో ఆర్డీవోకు వినతి పత్రం ఇస్తున్న జనసేన నేత మహేష్‌, గ్రామస్థులు

మదనపల్లె టౌన్‌, జూన్‌ 27: మదనపల్లె మండలం పోతబోలు పంచాయ తీలోని 200కుటుంబాల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు చేయ డం తోపాటు నిరాహారదీక్షలు తప్పవని స్థానిక ప్రజలతోపాటు జనసేన పార్టీ నేత మైఫోర్స్‌ మహేష్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టరే ట్‌లో ఆర్డీవో ఎంఎస్‌ మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్ర మానికి గ్రామస్థులతో పాటు వచ్చిన మహేష్‌ మాట్లాడుతూ పోతబోలు పంచాయతీలోని కొంకివారిపల్లె, మల్లయ్యదేవర, వలసమూల గ్రామాల్లో 200 కుటుంబాలు నివశిస్తున్నా గ్రామాలకు వెళ్లేందుకు కచ్చారోడ్లు కూడా లేవన్నారు. గర్భిణులు నొప్పులు వస్తే, విషపాముల కాటుకు ఎవరైన గురైతే కనీసం ఆంబులెన్స్‌ కూడా వెళ్లలేని పరిస్థితి వుందన్నారు. పాల కులు వస్తున్నారు, పోతున్నారే కాని ఈ గ్రామాల గోడు పట్టించుకోలే దన్నారు. నెల రోజుల్లో అధికారులు ఈ గ్రామాలకు రోడ్లు వేయకుంటే జనసేన ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేస్తామని మహేష్‌ హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో మురళికి వినతి పత్రం అందజేశారు. తట్టివారిపల్లె పంచాయతీ పుంగనూరు, వాండ్లపల్లెలో సీసీ రోడ్లు నిర్మించినా  ఇరువైపులా మట్టి తోలకపోవడంతో వాహనాలు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆర్డీవోకు విన్నవించారు. సీటీఎం పం చాయతీ చిన్నాయునిచెరువు రెండు మొరవల నుంచి వచ్చే నీరు, సీటీఎం పెద్దచెరువులో కలిసేందుకు ఉన్న కాలువలను కొందరు రియల్టర్లు పూడ్చేసి, నీటిని వారి భూముల్లో వెళ్లేలా దారి మళ్లించారని రైతులు వాపోయారు. అంతేకాకుండా ఆ గ్రామ వలంటీర్‌, అతని కుటుంబీకులు ఈ కాలువ భూమిలో అనుభవ పట్టా తెచ్చుకుని నిర్మాణాలు చేస్తున్నా రని, విచారించి న్యాయం చేయాలని గ్రామస్థులు ఆర్డీవోను కోరారు. మదనపల్లె-పీలేరు మధ్య నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌-71కు భూములు, ఇళ్లు కోల్పోతున్న బాధితులకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వా లని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. 

స్పందనకు మూడు వినతులు


మదనపల్లె క్రైం, జూన్‌ 27: స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మూడు వినతులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇందులో ఎస్బీఐ కాలనీలో కోతులు, కుక్కల బెడద, కుమారపురంలో నీటికొళాయి కనెక్షన్‌ మంజూరు కోసం, శివాజీనగర్‌లో ఒంటరి మహిళకు ఫించన్‌ మంజూరు  తదితర సమస్యలపై వినతులు వచ్చాయి. వాటిపై తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకో వాలని కమిషనర్‌ రఘునాథరెడ్డి సిబ్బందికి సూచించారు.

Updated Date - 2022-06-28T04:59:11+05:30 IST