శాకాంబరీ నమోస్తుతే

ABN , First Publish Date - 2021-07-25T06:12:10+05:30 IST

ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలంలో శనివారం భ్రమరాంబదేవికి శాకాంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

శాకాంబరీ నమోస్తుతే
శ్రీశైలంలో పూజలు చేస్తున్న ఈవో

  1. భ్రమరాంబకు ప్రత్యేక అలంకారం
  2.  మహానంది కామేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు


శ్రీశైలం/మహానంది, జూలై 24: ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలంలో శనివారం భ్రమరాంబదేవికి శాకాంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలో ముందుగా అర్చకులు, వేదపండితులు లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా మహా గణతికి పూజలు నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, ఫలాల తో అమ్మవారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణంలో ని రాజరాజేశ్వరీ దేవిని, గ్రామదేవత అంకాళమ్మను ప్రత్యేకంగా అలం కరించారు. అనంతరం ఉత్సవ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల శాకాలతో అలంకరించారు. ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారికి శాకాంబరి ఉత్సవం నిర్వహిస్తే కరువు కాటకాలు ఉండవని భక్తులు విశ్వసిస్తారు. అతివృష్టి, అనావృష్టి ఉండదని, సకాలంలో తగినంత వర్షం కురిసి, పంటలు బాగా పండుతాయని పురాణాలు చెబుతున్నాయి. 


కామేశ్వరి అమ్మవారికి..


ఆషాఢమాసం పౌర్ణమిని పురస్కరించుకొని మహానంది క్షేత్రంలో కామేశ్వరీదేవికి శనివారం ఆలయ వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి శాకాంబరి అలంకారం కోసం నంద్యాలకు చెందిన లక్కబోయిన ప్రసాద్‌, ఆదిలక్షమ్మ దంపతులు వెయ్యి కేజీల కూరగాయలు, పండ్లను సమర్పించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారిని ఫలాలు, కూరగాయలతో అలంకరించారు. అనం తరం ఆలయ వేదపండితులు రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మ, హనుమంత రాయశర్మ, నారాయణశర్మ, ప్రధాన అర్చకులు మామిళ్ళ పల్లి అర్జునశర్మ శ్రీచక్రానికి ప్రత్యేక ఉపచారాలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం కదంబ నివేదనం చేశారు. అమ్మవారి అంతరాలయం, సింహ మంటపాన్ని కూరగాయలతో అలంకరించారు. వేడుకల్లో ఈవో మల్లికార్జున ప్రసాద్‌, ఏఈవో ఎర్రమల్ల మధు, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు సుబ్బారెడ్డి, సురేంద్రరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:12:10+05:30 IST