అలాగైతే నిశ్చింత!

ABN , First Publish Date - 2021-03-12T05:47:15+05:30 IST

కర్మసన్యాసయోగంలో ప్రధానంగా ‘‘ఏ పనైనా అది జరుగుతూ ఉంటుంది తప్ప నేను చేయడం లేదని భావించాలి. అప్పుడు నీకు ఏ బంధాలు ఉండవు. మళ్లీ జన్మ ఎత్తే పనిలేదు. జీవన్ముక్త స్థితిని పొందినట్టే’’ అని శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు. ఈ లోకాన్నంతా

అలాగైతే నిశ్చింత!

కర్మసన్యాసయోగంలో ప్రధానంగా ‘‘ఏ పనైనా అది జరుగుతూ ఉంటుంది తప్ప నేను చేయడం లేదని భావించాలి. అప్పుడు నీకు ఏ బంధాలు ఉండవు. మళ్లీ జన్మ ఎత్తే పనిలేదు. జీవన్ముక్త స్థితిని పొందినట్టే’’ అని శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు. ఈ లోకాన్నంతా భగవంతుడు సృష్టించాడు బ్రహ్మరూపంలో! విష్ణురూపంలో పోషిస్తున్నాడు. ఆయనే శివుని రూపంలో సంహారం చేస్తున్నాడు అంటారు. పెద్దలు భగవంతుణ్ణి ‘సృష్టి స్థితి సంహారకర్త’ అని అంటారు. ‘‘మరి ఆయన పని ఆయన చేస్తున్నాడా?’’ అంటే ‘నేనూ అంతే’ అంటాడు పరమాత్మ. కర్మఫలాలతో నాకు సంబంధం లేదని అంటాడు. భగవద్గీత ఐదవ అధ్యాయంలోని 14వ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పాడు. 



న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః

న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే!


ఈ లోకాలకు కర్తృత్వాలను గానీ, కర్మలను గానీ భగవంతుడు ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఎవరో చేస్తున్నారు అనుకోవడం పొరపాటు. అందుకే లోకంలోని కర్మఫలాలతో భగవంతుడికి సంయోగం కూడా లేదు. దాని స్వభావం ప్రకారం అది నడుస్తోంది. లోకాన్ని సృష్టించిన భగవంతుడికి గానీ, లోకానికి గానీ, ఒక వ్యక్తికిగానీ కర్మ ఫలం సంయోగం ఉండవలసిన అవసరం లేదు. స్వభావంతో అది నడుస్తూ ఉంటుంది. అది తెలుసుకుంటే ఎలాంటి స్వభావంతో ఉండాలనుకుంటే అలా ఉండటానికి వీలవుతుంది! జీవితంలో నిశ్చింతగా ఉండటానికి ఇదో ఉపాయం.

గరికిపాటి నరసింహారావు

Updated Date - 2021-03-12T05:47:15+05:30 IST