‘అధికారులు వస్తే.. సమాచారం ఇవ్వరా?’

ABN , First Publish Date - 2021-02-28T05:36:26+05:30 IST

అధికారులు గ్రామాలలోకి వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వక పోవడం శోచనీయమని వైస్‌ ఎంపీపీ గడ్డం లస్మన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం భీంపూర్‌ రై

‘అధికారులు వస్తే.. సమాచారం ఇవ్వరా?’

భీంపూర్‌, ఫిబ్రవరి 27: అధికారులు గ్రామాలలోకి వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వక పోవడం శోచనీయమని వైస్‌ ఎంపీపీ గడ్డం లస్మన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం భీంపూర్‌ రైతు వేదిక భవనంలో ఎంపీపీ కుడిమెత రత్నప్రభాసంతోష్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో వైస్‌ ఎంపీపీ మాట్లాడుతూ పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అలాగే పక్కనున్న మహారాష్ట్ర కాంట్రాక్టర్లు మండలంలో కొన్ని శివార్లలో టేకుచెట్లు నరుకుతున్నారని, వాటికి పర్మిట్లు ఉన్నాయా? అని జడ్పీటీసీ కుమ్రసుధాకర్‌ ప్రశ్నించారు. వాటికి అనుమతి ఉందని ఎఫ్‌ఎస్‌వో గులాబ్‌ సమాధానమిచ్చారు. తాంసి (కె)లో 25 మందికి రేషన్‌కార్డులు లేవని సర్పంచ్‌ కరీం తహసీల్దార్‌ సోముకు విన్నవించారు. భగీరథ నీరురానప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చెప్పాలని సర్పంచ్‌లు కృష్ణ, కరీం, కళ్యాణిలు ప్రశ్నించారు.  

Updated Date - 2021-02-28T05:36:26+05:30 IST