బాత్‌రూమ్‌ చిన్నగా ఉంటే..!

ABN , First Publish Date - 2020-12-03T05:30:00+05:30 IST

బాత్‌రూమ్‌లు ఇరుకుగా ఉండటం అందరిలో ఇళ్లలో కనిపించేదే. అయితే చిన్న చిన్న మార్పులతో బాత్‌రూమ్‌లను విశాలంగా కనిపించేలా చేయవచ్చు.

బాత్‌రూమ్‌ చిన్నగా ఉంటే..!

బాత్‌రూమ్‌లు ఇరుకుగా ఉండటం అందరిలో ఇళ్లలో కనిపించేదే. అయితే చిన్న చిన్న మార్పులతో బాత్‌రూమ్‌లను విశాలంగా కనిపించేలా చేయవచ్చు. స్థలం లభ్యతను బట్టి వస్తువులు ఎంచుకోవడం, చాలినంత వెలుతురు ఉండేలా చూసుకోవడం ద్వారా సౌకర్యంగా మార్చుకోవచ్చు.


 బాత్‌రూమ్‌ గోడలకు, సీలింగ్‌కు లేత రంగులు వేయాలి. డోర్‌కు సైతం కూల్‌ కలర్స్‌ను ఎంచుకోవాలి. ఎరుపు, నారింజ, ముదురు పసుపు వంటి రంగులను ఎంచుకోకూడదు.


 లైటింగ్‌ సరిగా ఉండేలా చూసుకోవాలి. రౌండ్‌ వాష్‌ బేసిన్‌ ఎంచుకోవడం ద్వారా స్థలం కలిసొస్తుంది. 


 తెలుపు రంగు టైల్స్‌ వేయించుకోవడం వల్ల బాత్‌రూమ్‌ విశాలంగా కనిపిస్తుంది.

Updated Date - 2020-12-03T05:30:00+05:30 IST