సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రానికి ‘బజార్ రౌడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో కె ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మహి కథానాయిక. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రేమ్‌రక్షిత్ మాస్టర్ నేతృత్వంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వినోదాత్మకంగా సాగే చిత్రమిది. మా ప్రాజెక్ట్‌లోకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అడుగుపెట్టడంతో సినిమా గ్రాఫ్ మారిపోయింది. ఆయన కొరియోగ్రఫీలో 20మందికి పైగా డాన్సర్లతో హీరోహీరోయిన్లపై ఓ ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నాం. ఇప్పటికే టాకీ పూర్తయింది. త్వరలో క్లైమాక్స్, మిగిలిన రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేస్తాం. త్వరలో టీజర్, ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం’’ అని అన్నారు.