హెల్మెట్‌ పట్టీ పెట్టుకోకుంటే.. 1,000 జరిమానా!

ABN , First Publish Date - 2022-05-21T07:58:23+05:30 IST

హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపితే.. జరిమానా ఎంతో తెలుసా? కొత్త మోటారు వాహన చట్టం మేరకు రూ. 1,000 దాకా పెనాల్టీ తప్పదు.

హెల్మెట్‌ పట్టీ పెట్టుకోకుంటే.. 1,000 జరిమానా!

ఐఎస్‌ఐ గుర్తింపు లేకుంటే మరో రూ.వెయ్యి

స్పష్టం చేస్తున్న కేంద్ర మోటారు వాహన చట్టం


న్యూఢిల్లీ, మే 20: హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపితే.. జరిమానా ఎంతో తెలుసా? కొత్త మోటారు వాహన చట్టం మేరకు రూ. 1,000 దాకా పెనాల్టీ తప్పదు. అయితే.. హెల్మెట్‌ పట్టీ (స్ట్రాప్‌) లేకున్నా.. ఐఎ్‌సఐ మార్క్‌ లేని హెల్మెట్‌ను వాడినా విధించే జరిమానా ఎంతో తెలుసా?? అక్షరాలా రెండు వేల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌ 1 నుంచి భారత నాణ్యత-ప్రమాణాల బ్యూరో(బీఐఎస్‌) గుర్తింపు (ఐఎ్‌సఐ మార్కు) లేని హెల్మెట్లను నిషేధించిన విషయం తెలిసిందే..! ఈ నేపథ్యంలో కొత్త మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 194డీ ప్రకారం.. ఈ ఉల్లంఘనకు రూ. 1,000 మేర జరిమానా ఉంటుంది. అదేవిధంగా.. ఐఎ్‌సఐ మార్క్‌ హెల్మెట్‌ ఉన్నా.. దానికి పట్టీ(స్ట్రాప్‌) లేకున్నా.. వాహనదారుడు దాన్ని పెట్టుకోకున్నా.. మరో రూ. 1,000 జరిమానా విధించాలని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. పైగా.. మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 129 ప్రకారం.. ఈ రెండు ఉల్లంఘనలకు మూడు నెలల పాటు లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసే అవకాశాలు ఉంటాయి.

Updated Date - 2022-05-21T07:58:23+05:30 IST