కీళ్ల నొప్పులు అదుపులో...

ABN , First Publish Date - 2022-09-13T19:33:41+05:30 IST

ఆర్థ్రయిటిస్‌ నొప్పులతో బాధపడేవాళ్లు ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌...

కీళ్ల నొప్పులు అదుపులో...

ర్థ్రయిటిస్‌ నొప్పులతో బాధపడేవాళ్లు ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ అదుపులో ఉంటుంది.  ఈ కోవకు చెందిన వాళ్లు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటే...


శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగితే స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహంలాంటి దీర్ఘకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే చేపల ఎక్కువగా తినాలి. కొవ్వు తక్కువ ప్రొటీన్‌, పీచు ఎక్కువగా ఉండే సోయాబీన్‌ వాడకం పెంచాలి. వాల్‌నట్‌ ఆయిల్‌, ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అవకాడో, శాఫ్లవర్‌ ఆయిల్స్‌ కొలస్టరాల్‌ తగ్గించే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి వంటల్లో వీటిని వాడాలి. అలాగే యాంటి ఆక్సిడెంట్లు ఉండే గ్రీన్‌ టీ వీలైనన్ని ఎక్కువసార్లు తాగాలి. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ పళ్లు ఎక్కువగా తినాలి. విటమిన్‌ సి కీళ్ల వాపు తగ్గించి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చక్కెర శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ మెసెంజర్స్‌ అయిన సైటోకైన్స్‌ను ప్రేరేపిస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే శాచురేటెడ్‌ ఫ్యాట్‌ అడిపోజ్‌ (ఫ్యాట్‌ టిష్యూ) ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. కాబట్టి ఇది ఉండే పిజ్జా, బర్గర్లను తగ్గించాలి. సన్‌ఫ్లవర్‌, శనగ నూనెల్లో ఉండే ఒమేగా6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి. కాబట్టి వీటితో చేసిన వంటకాలను తగ్గించాలి.

Updated Date - 2022-09-13T19:33:41+05:30 IST