AP News: సమస్యను పరిష్కరిస్తే.. పిటిషనర్‌తో సెల్ఫీ ఫొటో అప్లోడ్ చేయాల్సిందే : సీఎం జగన్

ABN , First Publish Date - 2022-09-30T00:31:38+05:30 IST

Tadepalli: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ‘స్పందన’ కార్యక్రమంపై ఫోకస్ పెట్టారు. గురువారం ఆయన స్పందన (Spandana) కార్యక్రమంపై సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘ప్రతి అధి

AP News: సమస్యను పరిష్కరిస్తే.. పిటిషనర్‌తో సెల్ఫీ ఫొటో అప్లోడ్ చేయాల్సిందే : సీఎం జగన్

Tadepalli: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ‘స్పందన’ కార్యక్రమంపై ఫోకస్ పెట్టారు. గురువారం ఆయన స్పందన (Spandana) కార్యక్రమంపై సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘ప్రతి అధికారి స్పందన కార్యక్రమంలో పాల్గొనాలి. అప్పుడే 50 శాతం సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటలలోపు సచివాలయాల వద్ద స్పందన కార్యక్రమం జరగాలి. దీనికి అధికారులంతా హాజరుకావాల్సిందే. స్పందనకు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారం అయితే.. పరిష్కరించిన అధికారి దరఖాస్తుదారు(పిటిషనర్)తో సెల్ఫీ దిగి అప్లోడ్ చేయాల్సిందే. ఇది ప్రజల్లో సంతృప్త‌ స్ధాయిని పెంచుతుంది. ప్రతి కార్యాలయంలో ఏసీబీ నెంబర్ ఖచ్చితంగా అందరికి కనిపించేలా ఉంచాలి. లేకపోతే సంబధిత శాఖాధికారిపై చర్య తీసుకుంటాం’’ అని సీఎం ఆదేశించారు. 


ఎమ్మెల్యేలు, అధికారులకు దిశానిర్దేశం..

సీఎం జగన్ ఎమ్మెల్యేలు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫలితమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.  ‘‘ప్రతి ఎమ్మెల్యే నెలలో 6 సచివాలయాలకు వెళ్ళాలి. తరువాత నెలలో మరో 6 సచివాలయాలకు వెళ్లేటప్పడికి.. ముందు వెళ్లిన సచివాలయాలలో పనులు మొదలవ్వాలి. ఈ క్రాప్‌పై ప్రతి కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. డిజిటల్ లైబ్రరీ బిల్టింగ్‌లకు అన్నింటికన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. హౌసింగ్ విషయంలోనూ, ఇళ్లస్థలాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 21 డిసెంబర్ నాటికి కనీసం 5 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తిచేయాలి. 3.5 లక్షల ఇళ్లు జగనన్న కాలనీలుగా , 1.5 లక్షల ఇళ్ళు టిడ్కో ద్వారా పూర్తిచేయాలి.  ఆ దిశగా అధికారులు పనులు వేగవంతం చేయాలి. ఇళ్లు పూర్తయ్యే నాటికి విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు సమకూర్చాలి.’’ అని సూచించారు. 

Updated Date - 2022-09-30T00:31:38+05:30 IST