ఖరీఫ్‌ మొదలైనా.. కలుపు తీయరా..?

ABN , First Publish Date - 2022-07-02T11:58:27+05:30 IST

ఆదినిమ్మాయపల్లె ఆనక ట్ట నుంచి కేసీ ప్రధాన కాలువ పాతకడప చెరువుకు ఉంది. ఈ మధ్యలో శివాలపల్లె, గోపవరం మధ్యలో చెన్నూరుకు వచ్చే కాలువ ఉంది. ఈ కాలువ కింద చెన్నూరుతో పాటు రామనపల్లె, ముండ్లపల్లెలో కొంత భాగం, గుర్రంపాడు

ఖరీఫ్‌ మొదలైనా.. కలుపు తీయరా..?
కోతకొచ్చిన పైరు కాదు.. గుర్రంపాడుకు వెళ్లే కాలువలో ఏపుగా పెరిగిన గడ్డి

కాలువల్లో నీరు పారకపోతే సాగు ఎలా..    

ఆవేదన చెందుతున్న కేసీ ఆయకట్టు రైతులు


జిల్లాలో ప్రధాన నీటి వనరు కేసీ కెనాల్‌. ఈ కాలువ ఆయకట్టు కింద వేలాది ఎకరాలున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. కేసీ కెనాల్‌లో త్వరలో నీళ్లు వదలనున్నారు. అయితే దీని ఉప కాలువల్లో ఏ ఒక్కటి కూడా నీరు పారేలా లేదు. రకరకాల ఆకు తీగలు, గుర్రపుడెక్క, గడ్డి, విపరీతంగా పెరిగాయి. కొన్ని చోట్ల ఇక్కడ కాలువ అనేది ఉందా అనే అనుమానం వచ్చేలా గడ్డి కాలువంతటినీ కప్పేసింది. దీంతో కేసీ కాలువలకు నీరు వదిలితే చివరి ఆయకట్టుకు సక్రమంగా పారుతుందా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


చెన్నూరు, జూలై 1: ఆదినిమ్మాయపల్లె ఆనక ట్ట నుంచి కేసీ ప్రధాన కాలువ పాతకడప చెరువుకు ఉంది. ఈ మధ్యలో శివాలపల్లె, గోపవరం మధ్యలో చెన్నూరుకు వచ్చే కాలువ ఉంది. ఈ కాలువ కింద చెన్నూరుతో పాటు రామనపల్లె, ముండ్లపల్లెలో కొంత భాగం, గుర్రంపాడు రెవెన్యూ ప్రాంతాల్లో పొలాలకు నీరు అందుతుంది. అయితే ఈ కాలువ పొ డవునా కనీసం ఓ 50 మీటర్ల మేర కూడా శు భ్రంగా లేని పరిస్థితి. ప్రతి చోట నీటి పారకా నికి కాలువలో ఏదో ఒక్క తీగజాతి మొక్కలు అడ్డుగానే ఉన్నాయి. ప్రతి వేసవిలో కాలువను రైతులకు ఇబ్బంది లేకుండా శుభ్రం చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గత ఏడాది, అంతకమునుపు, అప్పుడప్పుడూ ఉపా ధి హామీ పథకంలో కాలువలను శుభ్రం చేసి నప్పటికీ ఈ ఏడాది ఆ ఊసే లేదు. ఉపాధి కూలీలతో కాలువలను శుభ్రం చేసేందుకు వీలు కాని పక్షంలో చిన్న పాటి ఎక్సకవేటర్లను ఏర్పాటు చేసి కాలువల్లో పెరిగిన గడ్డిమొక్కల ను తొలిగించవచ్చు. ఆ దిశగా ఏ ఒక్కరూ దృ ష్టి సారించలేదు. కాలువ ఇలా ఉంటే సాగు ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అంచనాలు పంపించాం..

- దీపక్‌, కేసీ కెనాల్‌ ఏఈ 

కేసీ కెనాల్‌లో చెన్నూరు నుంచి గుర్రంపాడు వరకు కాలువ పొడవునా గుర్రపుడెక్క, గడ్డి పెరిగింది చూశా. కాలువలో సన్నటి ధారగా నీరు ప్రవహిస్తోంది. కాలువ అడుగు భాగం ఆరిపోగానే పనులు చేయించి అడ్డంకులు మొత్తం తొలగిస్తాం. ఇప్పటికే ఈఈకి అంచనాలు పంపించాం. చెన్నూరు వద్ద పలువురు ఇంటి యజమానులు తమ ఇంటిలోని వృధా నీటిని, మురుగు నీటిని కాలువలోకి పైపుల ద్వారా మళ్లిస్తున్నారు. దీంతో దుర్వాసనతో కూలీలు కూడా పని చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లాం. వాళ్లు మురుగు నీరు ఇళ్ల నుంచి కాలువలోకి రాకుండా అరికట్టాల్సి ఉంది. ఏదేమైనా రైతులు పంటలు సాగు చేయకముందే కాలువలను శుభ్రం చేయిస్తాం.


పట్టించుకుంటే కదా..

- సుబ్బారెడ్డి, రైతు, రామనపల్లె

కేసీ కెనాల్‌ అధికారులు కాలువలను శుభ్రం చేయడంపై దృష్టి పెట్టలేదు. బోర్ల కింద సాగు చేయాలంటే కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తుంది. పైగా కరెంట్‌ ఎప్పుడు పోతుందో ఎప్పుడు  వస్తుందో తెలిదు. భూమిని కౌలుకు మాట్లాడి కూడా వెనక్కి వచ్చేశాను. పంట సాగుకు నీరే కదా ముఖ్యం. ఆ నీరే సక్రమంగా పారకపోతే పొలం తీసుకొని ఏమి చేయాలి.


సాగు చేయాలంటే ఎలా..?

- ఏ.రాజశేఖర్‌రెడ్డి, రైతు, ముండ్లపల్లె

కేసీ కాలువలను ప్రతి సంవత్సరం ఎండాకాలంలో శుభ్రం చేయాలి. ఒక్క సంవత్సరం సరిగా చేయకపోయినా ఇబ్బందే. సకాలంలో పంటలు సాగు చేసుకుంటే గట్టెకే ్క అవకాశం ఉంది. ఈ పాలనలో కాలువలు శుభ్రం చేయరు. మోటర్లకు మీటర్లు పెడతామంటారు. కరెంట్‌ సక్రమంగా ఇవ్వకుండా కోత పెడుతున్నారు. ఇక పంట సాగు చేయాలంటే ఎలా. కేసీ కాలువ కింద సాగు అంటేనే భయపడేలా చేస్తున్నారు. 

Updated Date - 2022-07-02T11:58:27+05:30 IST