దేశం అంతా చీకట్లో ఉంటే తెలంగాణలో వెలుగులు: కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-04-30T01:37:10+05:30 IST

దేశం అంతా చీకట్లో ఉంటే తెలంగాణలో వెలుగులు: కేసీఆర్‌

దేశం అంతా చీకట్లో ఉంటే తెలంగాణలో వెలుగులు: కేసీఆర్‌

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాకముందు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అల్లా, భగవంతుని దయవల్ల అన్నిసమస్యలను అధిగమించామని చెప్పారు. దేశం అంతా చీకట్లో ఉంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా మైనార్టీ గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి రోగం సోకిందని, చికిత్స చేయాలని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. దేశం ఏ విధంగానూ నష్టపోకూడదని, కూల్చివేతలు, పడగొట్టడాలు సులువు.. దేశాన్ని నిర్మించడం కష్టమని కేసీఆర్ అన్నారు. అల్లర్లు చేసేవారి ఆటలు తెలంగాణలో సాగవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-30T01:37:10+05:30 IST