సమస్యలుంటే పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి

ABN , First Publish Date - 2022-08-08T05:59:40+05:30 IST

సమస్యలు తలెత్తినప్పుడు దళారులను ఆశ్రయించకుం డా నేరుగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఇన్‌చార్జి డీసీపీ చెన్నూరి రూపేష్‌ సూచించారు.

సమస్యలుంటే పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి
ఇన్‌చార్జి డీసీపీకి మొక్క అందజేస్తున్న ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు

- ఇన్‌చార్జి డీసీపీగా రూపేష్‌

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 7 : సమస్యలు తలెత్తినప్పుడు దళారులను ఆశ్రయించకుం డా నేరుగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఇన్‌చార్జి డీసీపీ చెన్నూరి రూపేష్‌ సూచించారు. ఆదివారం ఆయన ఇన్‌చార్జి డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనం తరం ఆయన మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలుచేస్తూ చట్ట వ్యతిరేక చర్యల కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అక్రమ దందాలు, రవాణా, అసాంఘీక కార్యకలాపాలపై పోలీసులకు సమాచరం ఇచ్చి సహకరించాలని కోరా రు. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అనం తరం ఆయనను ఏసీపీలు సాదుల సారంగపాణి, గిరిప్రసాద్‌, సీఐలు ప్రదీప్‌కుమా ర్‌, అనీల్‌కుమార్‌, ఎస్సైలు రాజేష్‌, రాజవర్ధన్‌, అశ్విని తదితరులు ఆయనకు మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-08-08T05:59:40+05:30 IST