కొవిడ్‌ నివేదిక ఉంటేనే ఒడిశాలోకి...

ABN , First Publish Date - 2021-05-11T05:07:57+05:30 IST

కొవిడ్‌ నెగిటివ్‌ నివేదిక ఉంటేనే ఒడిశాలోకి ప్రవేశించేందుకు ఆంధ్రా వాసులను అనుమతిస్తున్నారు. మండల పరిధి సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యమూ ఏదో ఒకపనికి ఒడిశా వెళ్తుంటారు.

కొవిడ్‌ నివేదిక ఉంటేనే ఒడిశాలోకి...
నిర్మానుష్యంగా ఉన్న ఒడిశా చెక్‌పోస్టు

భామిని : కొవిడ్‌ నెగిటివ్‌ నివేదిక ఉంటేనే ఒడిశాలోకి ప్రవేశించేందుకు ఆంధ్రా వాసులను అనుమతిస్తున్నారు. మండల పరిధి సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యమూ ఏదో ఒకపనికి ఒడిశా వెళ్తుంటారు. కొవిడ్‌ ఉధృతి దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో బత్తిలి సమీపంలో సిందుబా పరిసరాల్లో ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటుచేసింది. ఒడిశా వాహనాల గుర్తింపు కార్డులు, ఆధార్‌కార్డులు, కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు ఉంటేనే తప్పా ఆ రాష్ట్రంలోకి అనుమతించ డంలేదు. దీంతో బత్తిలి నుంచి గుణు పూర్‌కు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తి గా నిలిచిపోయాయి.  కాగా ఒడిశా నుంచి వచ్చే వాహనాలు  ఆంధ్రాలోకి అనుమతులు ఇవ్వగా, కర్ఫ్యూ సమయంలో మాత్రం నిలిపివేస్తున్నట్టు తహసీల్దార్‌ ఎస్‌.నరసింహమూర్తి తెలిపారు. కాగా బత్తిలి నుంచి జగన్నాథపురం మీదుగా ఉన్న అడ్డుదారిలో కూడా ఒడిశా ప్రభుత్వం రోడ్డు తవ్వేసింది. దీంతో ఆంధ్రా సరిహద్దు గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.


Updated Date - 2021-05-11T05:07:57+05:30 IST